దేశంలో గుర్తింపులేని రాజకీయ పార్టీలు 2,796

ప్రధానాంశాలు

దేశంలో గుర్తింపులేని రాజకీయ పార్టీలు 2,796

జాతీయ పార్టీలు 8, ప్రాంతీయ పార్టీలు 57

తెదేపా, తెరాస, వైకాపా, ఎంఐఎంలకు ప్రాంతీయ పార్టీల హోదా

ఈనాడు, దిల్లీ: దేశంలో ఇప్పటివరకూ నమోదైన పార్టీల వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, భాజపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి జాతీయహోదా కట్టబెట్టింది. 27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు పేర్కొంది. ఇవి కాకుండా 2,796 గుర్తింపులేని పార్టీలు ఉన్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని తెదేపా, తెరాస, వైకాపా, ఎంఐఎంలకు ప్రాంతీయపార్టీ హోదా ఉన్నట్లు తెలిపింది. జనసేనను గుర్తింపు లేని రాజకీయపార్టీల జాబితాలో చేర్చింది. 197 గుర్తులను ఫ్రీ సింబల్స్‌ లిస్ట్‌లో ఉంచింది. అందులో జనసేన గుర్తు గాజుగ్లాస్‌ను కూడా చేర్చింది. 2019 మార్చి 15న దేశంలోని పార్టీల పేర్లను ప్రకటించిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ జాబితాను సవరించింది. అయితే హైదరాబాద్‌ చిరునామాతో ఉన్న పార్టీలను కూడా ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని