రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రధానాంశాలు

రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ విధానాలతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగి ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ సమాధానమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదైన రాష్ట్రం తెలంగాణ అని, దీనికి ముఖ్యకారణం రైతుబంధు అని కేంద్రం బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వానివి రైతు అనుకూల వ్యవసాయ విధానాలని, అవి దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. వ్యవసాయ నిపుణుల సూచనలతో ఆరు నెలలు మేధోమథనం చేసి రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలలో నిధులు జమచేయడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి కల్పన, పంటల కొనుగోలు తదితర చర్యలతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని