తీన్మార్‌ మల్లన్న కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ప్రధానాంశాలు

తీన్మార్‌ మల్లన్న కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

నారాయణగూడ, హన్మకొండ, న్యూస్‌టుడే: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మల్లన్నపై ఫిర్యాదు చేసిన ప్రియాంక అనే యువతితో పాటు ఆమె స్నేహితుడు, సహోద్యోగి చిలక ప్రవీణ్‌ల వాంగ్మూలాలను నమోదు చేశారు. మల్లన్న నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌లో 2020 జనవరి నుంచి 8 నెలలపాటు పనిచేశానని, అతను చేసే బ్లాక్‌మెయిల్‌ను భరించలేక బయటికి వచ్చానని ప్రియాంక తెలిపారు. మల్లన్నకు వ్యతిరేకంగా చిలక ప్రవీణ్‌ మీడియా సమావేశం పెట్టడంతో.. అతనిపై కోపంతో ఛానల్‌లో ప్రవీణ్‌, తాను ఉన్న ఫొటోను ప్రదర్శించారన్నారు. అది తన వ్యక్తిగత జీవితానికి, కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉందని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

భయపడేది లేదు: తీన్మార్‌ మల్లన్న

‘హైదరాబాద్‌లోని క్యూ న్యూస్‌ కార్యాలయంపై పోలీసులు దాడి చేసి హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు వాటిలో ఉన్నాయి. రాష్ట్రంలో అవినీతి పాలనపై ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసుల కేసులకు భయపడేది లేదు’ అని తీన్మార్‌ మల్లన్న పేర్కొన్నారు. బుధవారం హన్మకొండలో ‘యుద్ధం మిగిలే ఉంది..7200’ పేరిట నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 29న అలంపూర్‌లో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని