మా కుటుంబాలను ఆదుకోండి...

ప్రధానాంశాలు

మా కుటుంబాలను ఆదుకోండి...

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చేనేత మహిళల వినతి

ఈనాడు, దిల్లీ: తమ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి చేనేత కుటుంబాలకు చెందిన మహిళలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని బుధవారం ఆయన నివాసంలో వారు కలిశారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం తగిన కృషి చేయడంలేదని తెలిపారు. భర్తలు చనిపోవడంతో కుటుంబాల పోషణ కష్టమవుతోందని, ఒంటరి మహిళలుగా అనేక అవమానాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన కేంద్ర మంత్రి.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జాతీయ నేతన్నల ఐకాస ఛైర్మన్‌ దాసు సురేశ్‌, బాధిత కుటుంబాల మహిళలు సుంకి సరోజ, శ్యామల సుమతి, కొలను నిర్మల తదితరులున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని