కొత్తగా 241 కొవిడ్‌ కేసులు: ఇద్దరి మృతి

ప్రధానాంశాలు

కొత్తగా 241 కొవిడ్‌ కేసులు: ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 241 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,63,026కు పెరిగింది. మహమ్మారితో మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 3,902 మంది కన్నుమూశారు. తాజాగా 298 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 52,943 నమూనాలను పరీక్షించారు.  తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 68 కొవిడ్‌ కేసులు నమోదవగా.. కరీంనగర్‌ జిల్లాలో 23, నల్గొండలో 16, ఖమ్మంలో 14, రంగారెడ్డిలో 14, హనుమకొండలో 13, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 11 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని