‘గీతం’ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలపై యూజీసీ నిషేధం

ప్రధానాంశాలు

‘గీతం’ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలపై యూజీసీ నిషేధం

ఈనాడు, హైదరాబాద్‌: గీతం విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) నిర్ణయం తీసుకుంది. దూరవిద్య కోర్సుల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించడం లేదంటూ ప్రవేశాలు తీసుకోవడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి దూరవిద్య, ఆన్‌లైన్‌ పద్ధతుల్లో ప్రవేశాలు తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దూరవిద్య కోర్సులపై యూజీసీ నిషేధం విధించిన మాట వాస్తవమేనని వర్సిటీ దూరవిద్య కేంద్రం సంచాలకుడు చంద్రశేఖర్‌ తెలిపారు. దీనిపై యూజీసీకి వివరణ ఇస్తున్నామని, త్వరలోనే నిషేధం తొలగి ప్రవేశాలు తీసుకునేందుకు అనుమతి వస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని