ఏఐటీటీ-21లో సత్తాచాటిన తెలంగాణ విద్యార్థి

ప్రధానాంశాలు

ఏఐటీటీ-21లో సత్తాచాటిన తెలంగాణ విద్యార్థి

ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో సురేష్‌కు ప్రథమ ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: కంప్యూటర్‌ ఆధారిత ఆలిండియా ట్రేడ్‌టెస్ట్‌ (ఏఐటీటీ-21)లో ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో తెలంగాణకు చెందిన సొనమోని సురేష్‌ మొదటిర్యాంకుతో సత్తా చాటారు. ఈ సందర్భంగా సురేష్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఉపాధికల్పన శాఖ కమిషనర్‌ కేవై నాయక్‌ అభినందించారు. ప్రథమ ర్యాంకుతో సత్తాచాటిన సురేష్‌కు మంచి ప్రోత్సాహం అందించాలని, మేథోసర్వే డ్రైవ్‌ హైదరాబాద్‌లో ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు మంచి జీతం, అలవెన్సులతో కూడిన ఉద్యోగాలతో పాటు బ్రిడ్జికోర్సుతో పాలిటెక్నిక్‌ చదివేందుకు అర్హత కల్పించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని