దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతాం: పవన్‌కల్యాణ్‌

ప్రధానాంశాలు

దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతాం: పవన్‌కల్యాణ్‌

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ ముందుకొచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి. కల్లూరు మండలం పెద్దపాడులో ఉన్న సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా ఏర్పాటు చేసేందుకు రూ.కోటితో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు, నీతి నిజాయతీలకు గుర్తుగా పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని సంకల్పించినట్లు ఆయన తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని