‘దళితబంధు’ కొనసాగించేలా ఆదేశించండి

ప్రధానాంశాలు

‘దళితబంధు’ కొనసాగించేలా ఆదేశించండి

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన దళితబంధును వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దళిత బంధు పథకం అమలును నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య పిటిషన్‌ వేశారు. ఎస్సీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువస్తూ రూ.10 లక్షల చొప్పున అందజేస్తోందన్నారు. ఈ ఏడాది మార్చిలో దళితుల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు చాలా ముందే.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే జూన్‌ 27న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. ఈ పథకాన్ని నిలిపివేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమని, ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్‌లను చేర్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని