వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి! - diy hand scrubs that you can use to get soft and supple hands in telugu
close
Updated : 06/07/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి!

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ లేదా ఇంట్లో ఉన్నా సరే... పదే పదే హ్యాండ్‌వాష్‌ లేదా సబ్బుతో చేతుల్ని రుద్ది మరీ కడుగుతున్నాం. అయితే ఇలా పదే పదే చేతుల్ని కడగడం వల్ల చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతున్నాయి.. నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇక దీనికి తోడు మహిళలకు అదనంగా ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతున్నాయి. ఫలితంగా దురద రావడం, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశమే ఎక్కువ. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే స్క్రబ్స్‌ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్‌ స్క్రబ్స్‌ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!

ఓట్‌మీల్‌ పొడితో...
* టేబుల్‌స్పూన్‌ ఓట్‌మీల్‌ పొడి, అర టేబుల్‌స్పూన్‌ కొబ్బరి నూనె.. ఈ రెండింటినీ బాగా కలుపుకొని చేతులు, మణికట్టుపై మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఓట్‌మీల్‌ చర్మానికి తేమనందించి కోమలంగా మార్చుతుంది. ఈ ప్యాక్‌ను రోజూ ప్రయత్నించవచ్చు.
* ఓట్‌మీల్‌ పొడిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక టొమాటోను మధ్యలోకి రెండు ముక్కలు చేసి.. ఒక ముక్కను ఓట్‌మీల్‌ పొడిలో అద్దాలి. దాంతో ఒక చేతిపై, మణికట్టుపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆపై మరో టొమాటో ముక్కను ఇంతకుముందులాగే ఓట్‌మీల్‌ పొడిలో ముంచి మరో చేతిపై రుద్దుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి.

* రెండు టేబుల్‌స్పూన్ల చక్కెరలో ఐదారు చుక్కల విటమిన్‌ ‘ఇ’ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చేతులు, మణికట్టుపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. విటమిన్‌ ‘ఇ’ డ్యామేజ్‌ అయిన చర్మాన్ని రిపేర్‌ చేసి తిరిగి ప్రకాశవంతంగా మార్చుతుంది.

* టేబుల్‌స్పూన్‌ కొబ్బరి నూనె, టేబుల్‌స్పూన్‌ తేనె, పావు కప్పు చక్కెర, పావు కప్పు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం.. వీటన్నింటినీ ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన స్క్రబ్‌ని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేసుకోవచ్చు. రోజూ కొద్దిగా ఈ స్క్రబ్‌ మిశ్రమాన్ని తీసుకొని చేతులకు, మణికట్టుపై నిమిషం పాటు రుద్దుకొని, గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
* ఇంట్లో లభించే పండ్లతోనే అప్పటికప్పుడు స్క్రబ్స్‌ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. ఉదాహరణకు ఇంట్లో ఉండే అరటిపండ్ల ముక్కలు, మామిడి పండు ముక్కలు లేదంటే దాని తొక్కను కూడా ఉపయోగించచ్చు. ఇలా వీటిని చక్కెరలో అద్ది.. దాంతో చేతుల్ని స్క్రబ్‌ చేసుకోవచ్చు.

* ఆలివ్‌ ఆయిల్‌, చక్కెరలతో తయారుచేసిన స్క్రబ్‌ కూడా పొడిబారిన చేతులను కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది. ఇందుకోసం అరకప్పు చక్కెరలో టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇందులో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా స్క్రబ్‌ తీసుకొని దాన్ని చేతులపై రాసుకొని రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పొడిబారిన చేతులు తిరిగి కోమలంగా మారతాయి.

* నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్‌ చేయాలి. ఈ ముక్కల్ని చక్కెర పొడిలో అద్దుతూ చేతులు, మణికట్టుపై ఇరవై నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. పాదాలు పొడిబారినా ఈ చిట్కా ఉపయోగించచ్చు. అయితే ముఖానికి మాత్రం దీన్ని ఉపయోగించద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే సున్నితంగా ఉండే ముఖ చర్మంపై నిమ్మకాయను నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు.

* కలబంద గుజ్జు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చేతులకు రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చేతులు పొడిబారడం తగ్గుతుంది.

* పొడిబారిన చేతుల్ని కోమలంగా మార్చే సుగుణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ కొద్దిగా తేనె తీసుకొని చేతులకు రాసుకోవాలి. ఇలా అరగంట పాటు ఉంచుకొని ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

* పొడిబారిన చేతులకు తేమను తిరిగి అందించడంలో కోడిగుడ్డులోని పచ్చసొన బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా గుడ్డలోని పచ్చసొనను ఒక బౌల్‌లోకి తీసుకొని అది మిశ్రమంగా మారేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతులకు, మణికట్టుపై పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సబ్బు, చల్లటి నీటితో కడిగేసుకుంటే గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల చేతులు కోమలంగా మారతాయి.
పడుకునే ముందు ఇలా..

రోజంతా ఇంటి పనులతో, వృత్తిఉద్యోగాల రీత్యా తీరిక దొరకని వారు పొడిబారిన చేతులకు రాత్రుళ్లు కూడా ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కాస్త కొబ్బరి నూనె లేదా బాదం నూనెను చేతులకు పట్టించి గ్లోవ్స్‌ పెట్టుకోవాలి. రాత్రంతా అలాగే ఉండడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి.. పొడిబారిన చర్మాన్ని తిరిగి రిపేర్‌ చేస్తుంది. కోమలంగా, తేమగా మార్చుతుంది.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని