ప్రసవం తర్వాత రంగు తగ్గా!
close
Published : 10/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రసవం తర్వాత రంగు తగ్గా!

నా వయసు 30. ప్రసవం తర్వాత రంగు తగ్గా. మెడ దగ్గర నల్లగా ఉంది. బరువూ పెరిగా. నేను ముందులా అవ్వాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

కడుపుతో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కుదరదు. చాలావరకూ ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుంటారు. సరైన పోషకాహారం తీసుకోకపోయినా, జంక్‌ ఫుడ్‌ తీసుకున్నా లావవుతారు. దాంతో చర్మం రాపిడికి గురై మెడ చుట్టూ నల్లగా మారుతుంది. బరువు తగ్గితే చర్మం పలుచబడి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. శరీరంలో మెలనోసైట్‌ పెరగడం, ఎండలో ఉండటం, ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, సరైన చర్మ సంబంధ ఉత్పత్తులను వాడకపోవడం. రంగు తగ్గడానికి కారణమవుతాయి. చక్కెర, గ్లూటెన్‌, కెఫిన్‌, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ కారం ఉండేవీ, వేడిని పెంచి రంగు తగ్గేలా చేస్తాయి.
ఆహారపరంగా.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉండే తాజాపండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. గుమ్మడి, చియా గింజలు, బాదం, నట్స్‌, పెరుగు, గ్రీన్‌ టీ, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లుండే చేపలు కూడా చర్మానికి మంచివి. పాల పొడి, తేనె, నిమ్మ రసం పెద్ద చెంచా చొప్పున తీసుకుని, దానికి సగం చెంచా బాదం నూనెను కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు తర్వాత కడిగేయాలి. అలాగే టొమాటో రసం, పెరుగు, ఓట్‌మీల్‌ పొడిని పెద్ద చెంచా చొప్పున తీసుకుని మొత్తాన్ని కలిపి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాలాగి కడిగేయాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోజూ గంట వ్యాయామమూ చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు నిమ్మతో క్లెన్సింగ్‌ చేసుకోవాలి. వీటితోపాటు మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ తప్పక రాయాలి. ఇలా చేస్తే నెమ్మదిగా మునుపటి రంగు వచ్చేస్తుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని