రంగు పడుద్ది!
close
Published : 11/06/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంగు పడుద్ది!

ఈ రోజుల్లో టీనేజీ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ అందరూ తలకు రంగు వేసుకుంటున్న వారే! అది సహజంగా కనిపించాలన్నా, ఎక్కువ రోజులు ఉండాలన్నా ఏం చేయాలంటే...

జుట్టుకి రంగు వేయాలనుకునే ముందు అసలది మీకు పడుతుందో లేదో ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. అమోనియా వంటి రసాయనాలు లేనివి, ఇండిగో కలర్స్‌ వంటి సహజ పదార్థాల ప్యాక్‌లూ దొరుకుతున్నాయి.

* రంగు వేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు తలకి ఏ ఉత్పత్తినీ వాడొద్దు. రెండు మూడు రోజుల ముందు మాత్రం తలస్నానం చేసి వెంట్రుకలకు నాణ్యమైన కండిషనర్‌ని పట్టించండి. తర్వాతే డై వేసుకోండి. దీనివల్ల జుట్టు పాడవదు. రంగూ చక్కగా పడుతుంది. ఆరోగ్యంగా కనిపిస్తుంది. పీచులా పొడి బారిన జుట్టుకు రంగు వేయడం మంచిది కాదు.

* రంగు వేసుకున్న మరుసటి రోజే తలస్నానం చేయొద్దు. కనీసం రెండు రోజులు ఆగండి. అప్పుడే అది ఎక్కువ రోజులు ఉంటుంది. అలానే షాంపూల్లో కూడా సల్ఫేట్లు లేనివి లేదా కలర్‌ సేఫ్‌ రకాలవి ఎంచుకోవాలి.

* కొందరికి వేణ్నీళ్ల స్నానం అలవాటు. కానీ రంగు వేసుకున్నప్పుడు ఇలా చేస్తే త్వరగా వెలిసిపోతుంది. జుట్టూపాడవుతుంది. అలానే...నీళ్లలోని క్లోరిన్‌, కాల్షియం వంటివి తలపై చేరి రంగు మారేలా చేస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ స్నానం చేసే అలవాటు మానుకోండి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని