తేనెలూరే అందం
close
Updated : 30/07/2021 04:46 IST

తేనెలూరే అందం

అందరికీ అందుబాటులో ఉండేది తేనె. ఇది ఆరోగ్యానికే కాదు... చర్మ సౌందర్యానికీ మంచిదే.

* పొడి చర్మతత్వం ఉన్నవారు పచ్చి పాలల్లో చెంచా తేనె కలిపి స్నానానికి ముందు ఒంటికి రాసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. చర్మానికి తేమ అంది మేను మెరుపును సంతరించుకొంటుంది.

* కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఇవి శరీరంపై పేరుకొని చర్మం బరకగా అనిపిస్తుంది. మృత కణాలూ పెరిగిపోతాయి. అందుకే టేబుల్‌ స్పూను తేనెలో అరస్పూన్‌ బాదం ముద్ద, చెంచా నిమ్మరసం కలుపుకొని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దాలి. పది నిమిషాలు ఇలా చేశాక గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకొంటే సరి.

*చర్మం సాగి ముడతలు పడితే వయసు మీరినట్లుగా కనిపిస్తారు. దీనికి పరిష్కారంగా టేబుల్‌ స్పూను తేనెలో, తెల్లసొన, చెంచా గ్లిజరిన్‌, మూడు చెంచాల బియ్యం రవ్వ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం నవయౌవన కాంతిని పొందుతుంది.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని