ముఖానికి మెరుపునిచ్చే ప్యాక్‌లు
close
Published : 03/09/2021 02:57 IST

ముఖానికి మెరుపునిచ్చే ప్యాక్‌లు

ముఖచర్మాన్ని మెరిసేలా చేయాలంటే సహజసిద్ధమైన కొన్ని ప్యాక్‌లు వేస్తే చాలంటున్నారు సౌందర్యనిపుణులు. వంటింటి పదార్థాలతోనే తళుక్కుమనొచ్చంటున్నారు. అవేంటో చూద్దాం.

టీతో... ఉదయం గ్రీన్‌టీ తాగే అలవాటుంటే దాంతో ముఖాన్ని కూడా మెరిసేలా చేసుకోవచ్చు. చల్లారిన కప్పు గ్రీన్‌ టీ డికాక్షన్‌లో అరచెంచా తేనె, రెండు చెంచాల బియ్యప్పిండిని కలిపి ముఖానికి రాసి తడిపొడిగా ఉన్నప్పుడు మృదువుగా మునివేళ్లతో రుద్దుతూ శుభ్రపరచండి. ఆపై చన్నీళ్లతో కడిగితే చాలు. మృతకణాలు తొలగి మెరుపులీనే ముఖం మీ సొంతమవుతుంది.

ఓట్స్‌తో... ఉడికించిన ఓట్స్‌లో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చాక చేతుల్ని తడిపి రుద్దాలి. ఈ ప్యాక్‌ మురికిని తొలగించి కళ తెస్తుంది.

నారింజ తొక్కలతో... నారింజపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని చెంచాతో తీసుకుని, దీనికి అరచెంచా పెరుగును కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చాలు. ఈ ప్యాక్‌ ముఖచర్మంపై ముడతలను, వృద్ధాప్యఛాయలను దూరం చేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

ఆలివ్‌ ఆయిల్‌తో... రెండు చెంచాల ఆలివ్‌ ఆయిల్‌కు చెంచా సీ సాల్ట్‌ను కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి పావుగంట సేపు ఆరనిచ్చి, తడిచేసిన మునివేళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటే మృతకణాలు పోతాయి. దీంతో ముఖం మెరుపులీనుతుంది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని