ఆరోగ్యానికి బీట్‌‘రూట్‌’!
close
Published : 17/03/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్యానికి బీట్‌‘రూట్‌’!

బీట్‌రూట్‌.. పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దీని తయారీ, లాభాలూ తెలుసుకుందాం...
బీట్‌రూట్‌లోని ‘బెలాటిన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.
* దీంట్లో పొటాషియం, ఫోలేట్‌ నిల్వలూ ఎక్కువే. ఇవి నాడులు సక్రమంగా పనిచేసేలా చూడటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి
* ఈ దుంపలో పుష్కలంగా ఉండే నైట్రేట్స్‌ ఎక్కువ సమయం పాటు శక్తినిస్తాయి. కాబట్టి రోజూ ఓ గ్లాసు జ్యూస్‌ తాగాలి.
* దీంట్లో ఇనుమూ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.
* క్యాల్షియం, ఖనిజాలు మెండుగా ఉండే దుంప ఇది. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి.
* ఈ రసం చక్కటి డిటాక్స్‌లా పనిచేస్తుంది. కడుపులోని ఆమ్లాలను క్రమబద్దీకరించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది.
* దీని రసం నుంచి అందే కెలొరీలు తక్కువ. అలాగే కొవ్వు అస్సలుండదు. కాబట్టి బరువు తŸగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు.
*  బీట్‌రూట్‌లోని బి, సి విటమిన్‌లు  ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడతాయి.

తయారు చేయడమెలా?

ముందుగా దుంపను శుభ్రంగా కడిగి, సన్నగా తురిమి మిక్సీలో వేయాలి. ఇందులో పావు చెంచా అల్లం తురుము, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత గ్లాసు నీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడబోసి నిమ్మరసం కలిపి తీసుకుంటే సరి. ఈ రసాన్ని గాలి చొరబడని డబ్బాలో పోసి ఒకరోజు వరకు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని