నీళ్లెందుకు తాగాలంటే...
close
Updated : 15/06/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీళ్లెందుకు తాగాలంటే...

నీళ్లు అధికంగా తాగడం వల్ల చర్మానికి కావల్సిన తేమ అందుతుంది. దాంతో ముడతలు తగ్గుతాయి. చర్మంలోని టాక్సిన్లు బయటకు వెళ్లి పోతాయి. దాంతో చర్మరంధ్రాలు శుభ్రపడమే కాక మొటిమలూ తగ్గుతాయి.
* నీళ్లు దప్పికను తీర్చడమే కాదు శరీరంలోని కణజాలాల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా ఎముకలు, కీళ్లు, కండరాలు కలిసే చోట ఉండే కార్టిలేజ్‌ (మృదు కణజాలం) ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మొత్తంలో నీరు తాగాలి. లేదంటే ఆ ప్రదేశానికి నీరు తగ్గి మృదులాస్థి గట్టిగా మారుతుంది. దాంతో కీళ్లనొప్పులు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.
* మెదడులో కూడా ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సిన నీరు అందుతుండాలి. అప్పుడే అది సక్రమంగా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగుంటాయి.
*శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి నీళ్లు సాయపడతాయి. ఎక్కువగా నీటిని తాగడం వల్ల శరీరంలోని కణాలన్నింటికీ నీరంది అవి ఆరోగ్యంగా ఉంటాయి.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని