ఆరోగ్యం పెరుగుతుంది
close
Published : 23/07/2021 01:07 IST

ఆరోగ్యం పెరుగుతుంది

షడ్రసోపేత భోజనం చేసినా... పెరుగన్నం తింటే కానీ అది పూర్తి కాదు. అలాంటి పెరుగు వల్ల ముఖ్యంగా మహిళలకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా?!

పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది దంతపుష్టికి, ఎముకల దృఢత్వానికీ దోహద పడుతుంది. కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ముప్పయి దాటిన స్త్రీలెందరో కాల్షియం లేమితో బాధ పడుతున్నారు. తగినంత పెరుగు తినక పోవడమే ఇందుకు కారణమని సర్వేలు చెబుతున్నాయి.

* కొందరు చిన్నారులు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. పాలు తాగుతున్నారు లెమ్మని వదిలేయక అలవాటు చేయాలి. పాల కన్నా పెరుగే మంచిది.

* పెరుగులో ఉన్న ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయి.

* ఇందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పెరుగులోని మినరల్స్‌వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని