అడుగు దూరమే.. ఆమె రోదసి లక్ష్యం!
close
Updated : 01/09/2021 05:37 IST

అడుగు దూరమే.. ఆమె రోదసి లక్ష్యం!

‘నాన్నా.. నేను చంద్రుడి మీదకు వెళతా’ అందో రెండేళ్ల పాప. తన బుజ్జి బుజ్జి మాటలు విన్న ఆ నాన్న నవ్వి ‘సరేనమ్మా! నిన్ను చందమామ మీదకి తీసుకెళ్లే డ్రైవర్‌కి ఆరోగ్యం బాలేదు. బాగై రాగానే తీసుకెళతాడు. సరేనా?’ అన్నాడు. కానీ.. ఆయనకప్పుడు తెలియలేదు.. ఆ అమ్మాయి సరదాగా కాదు.. అంతరిక్ష ప్రయాణం గురించి సీరియస్‌గానే అన్నదని! ఇప్పుడా అమ్మాయి నిజంగానే దాన్ని అందుకోడానికి అడుగు దూరంలోనే ఉంది మరి!

దయ కీర్తికకు చిన్నప్పటి నుంచీ ఆకాశంలో చంద్రుడినీ, నక్షత్రాలనీ అందుకోవాలనే కోరిక. స్కూల్లో ఉన్నప్పుడు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ల గురించి చదివి స్ఫూర్తి పొందింది. అంతరిక్షం గురించి తెలుసుకోవాలనుకునేది. వాళ్ల నాన్న బిల్‌బోర్డ్స్‌ పెయింటర్‌. ఇంటర్నెట్‌ పెట్టించేంత స్థోమత లేదు. దీంతో వార్తాపత్రికలు, మేగజీన్లలో సంబంధిత వార్తలేం వచ్చినా సేకరించేది. పది, ఇంటర్‌ తరగతుల్లో ఇస్రో నిర్వహించిన వ్యాసరచనా పోటీల్లో బహుమతులూ గెలుచుకుంది. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశమూ దక్కింది. వాళ్లతో మాట్లాడాక స్పేస్‌ మీద ఆసక్తి మరింత పెరిగింది. ఉక్రెయిన్‌లో కార్కివ్‌ నేషనల్‌ ఏర్‌ఫోర్స్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశమొస్తే అంది పుచ్చుకుంది. అక్కడ ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ను చేసింది. ఈమెది చెన్నై.

2019లో అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే పోలాండ్‌లోని అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అండ్‌ మిలిటరీ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ మెడిసిన్‌ నుంచి కబురొచ్చింది. ఆస్ట్రోనాట్‌ శిక్షణకు ఉదయ ఎంపికైందన్నది దాని సారాంశం. తనకేమో ఇంగ్లిష్‌పై అంతగా పట్టులేదు. శిక్షణ ఖర్చును భరించే స్థోమతా ఆమె కుటుంబానికి లేదు. కానీ హీరో విజయ్‌ సేతుపతి ఆమె గురించి తెలుసుకుని రూ.8 లక్షలు అందించాడు. వాటితో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లడానికి శిక్షణను తీసుకుంది. ఈ శిక్షణలో భాగంగా కొన్ని రోజులు ఒంటరిగా హ్యూమన్‌ సెంట్రిఫ్యూజెస్‌లో నివసించాలి. ఇక్కడ భూమికి భిన్నమైన వాతావరణంలో పైలట్లు, ఆస్ట్రోనాట్‌ల ప్రతిచర్య, భరించగల శక్తి మొదలైన అంశాలను పరిశీలిస్తారు. ఆ సమయంలో చాలా ఒత్తిడినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ తన లక్ష్యాన్ని తలచుకుంటూ విజయవంతంగా పూర్తి చేశానంటోంది ఉదయ. ఈ తరహా శిక్షణను పూర్తి చేసుకున్న మొదటి భారతీయురాలు తనే.

తాజాగా ఈమెకి కెనడాలో శిక్షణ తీసుకునే అవకాశమొచ్చింది. తన కలలను సాకారం చేసుకునే క్రమంలో మళ్లీ డబ్బే అవరోధమైంది. ‘నా లక్ష్యాన్ని చేరుకోగలనన్న నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఎప్పుడు ఒత్తిడి, నిరాశ ఎదురైనా తమిళనాడులోని మారుమూల గ్రామాల స్కూళ్లకు వెళ్లినపుడు నన్ను ఆశ్చర్యంగా చూసే ఆ పిల్లల చూపుల్ని గుర్తు చేసుకుంటా. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుతుంది. ఇప్పటి వరకూ దేశం నుంచి మానవ సహిత వ్యోమ నౌకలేమీ అంతరిక్షంలోకి వెళ్లలేదు. నేను వెళ్లి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడంతోపాటు వాళ్ల కలల్ని తీర్చుకునేలా వాళ్లకి సాయపడాలనేది నా కోరిక’ అంటోంది ఉదయ. తన కలను నెరవేర్చుకునే క్రమంలో తనూ ఓ అడుగు దూరంలోనే ఉంది. అందుకు అవసరమైన మొత్తం కోసం విరాళాలు సేకరిస్తోంది. అవి సమకూరి, తను దేశానికి గర్వకారణంగా నిలిచే స్థాయికి చేరాలని కోరుకుందాం.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని