ఇలా ప్రారంభించండి!
close
Updated : 27/08/2021 00:41 IST

ఇలా ప్రారంభించండి!

చాలామంది ఉద్యోగినులు వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనుకుంటారు. అందుకు తగినట్లు ఎక్కువ గంటలు పని చేస్తూ కష్టపడతారు కూడా. అయినా అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోతారు. వారు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ వైఫల్యాలు. మరి మీరూ అలా చేయకుండా దినచర్యను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో తెలుసుకుందామా...

గాఢంగా శ్వాస తీసుకోండి..

చాలామంది ఆదరాబాదరాగా పని మొదలుపెడుతుంటారు.  ఇంటి నుంచి పనిచేసేవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు లేవడమే ఆఫీసు మొదలయ్యే సమయానికి మరి. ఆఫీసుకు వచ్చే ఉద్యోగుల తిప్పలు మరో రకంగా ఉంటాయి. ట్రాఫిక్‌ జామ్‌, ఇతర ఇంటి పనులు.... ఇలా ఉంటాయి. వాటితో సతమతమవుతూ కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు తొందర తొందరగా పనులు పూర్తి చేయాలనుకుంటారు. మీరూ అలా చేయకండి. ఆఫీసుకు వచ్చాక రెండు నిమిషాలపాటు ప్రశాంతంగా కూర్చొండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఆ తర్వాత పని మొదలుపెట్టండి.

ఖాళీ మెదడుతో...

జరిగిపోయిన దాని గురించి బాధ, ఆందోళనలు పడకుండా ఈ రోజు ఏం చేయాలో అనేది మాత్రమే ఆలోచించండి. నిన్న జరిగిన ప్రతికూల అంశాలన్నింటినీ బుర్ర నుంచి ఖాళీ చేయండి.  ఈ రోజు చేసే పనులపై వందశాతం దృష్టి పెట్టండి.

పోషకభరిత అల్పాహారం..

ఇంటి నుంచి పనులు చేస్తున్నా, ఆఫీసుకు వెళుతున్నా ఖాళీ కడుపుతో ఉండకూడదు. తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాల్సిందే. ఇది పోషకభరితంగా ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం అనేది రోజులో చాలా ముఖ్యమైన మీల్‌. ఇది మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చి పనులు పూర్తయ్యేలా చేస్తుంది.

పక్కా ప్రణాళికతో...

ఆ రోజు ఏమేం పనులు చేయాలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో... ఓ చోట రాసుకోవాలి. ఇందుకోసం దాదాపు అరగంట కేటాయించుకోవాలి. అన్ని పనులను ప్రాధాన్య క్రమంలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఒక్కోటి పూర్తి చేసుకుంటూ పోతే సరి. సామాజిక మాధ్యమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిల్స్‌కు కూడా పరిమిత సమయాన్ని పెట్టుకుంటే సరి.

చలాకీగా...

మీకు ఎన్ని ఇబ్బందులున్నా.. పరిస్థితులు బాగాలేకపోయినా, కిందటి రోజు రాత్రి సరిగా నిద్రపోయకపోయినా... ఇలా ఎన్ని సమస్యలున్నా ఆఫీసులో మాత్రం చాలా అలెర్ట్‌గా ఉండాలి.మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని