యోగా మ్యాట్లలో రకాలెన్నో..!
close
Updated : 20/03/2021 06:25 IST

యోగా మ్యాట్లలో రకాలెన్నో..!

యోగాసనాలు వేయడానికి సాధారణంగా చాలామంది రబ్బర్‌ మ్యాట్‌లనే ఎక్కువగా వాడుతుంటారు. కానీ గడ్డీ, కాటన్‌, సేంద్రియ పదార్థాలతో చేసిన వివిధ రకాలూ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

కాటన్‌ చాపలు: గడ్డీ, కాటన్‌ వస్త్రంతో చేసిన ‘సంబు’ మ్యాట్‌లు దొరుకుతున్నాయి. ఇవి చల్లగా, మందంగా ఉండటంతో కండరాలు, జాయింట్లకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.

ఆక్యుపంచర్‌ ఫుట్‌మ్యాట్‌లు: శరీరంలోని ముఖ్యమైన భాగాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా వీటిని రూపొందించారు. వీటి మీద మూడు నుంచి ఐదు నిమిషాలపాటు జాగింగ్‌ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. యోగాకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేని వాళ్లు వీటిని ఎంచుకోవచ్చు.

గడ్డిచాపలు: వీటిని మధుర్‌కతి, కొరైగ్రాస్‌ అనే నది గడ్డితో తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో సేంద్రియ పద్ధతుల్లో వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. వివిధ రంగుల్లోని ఈ చాపలు ఏడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో పెద్దగా ఉంటాయి.

బెండు చాపలు: సహజసిద్ధమైన ఈ చాపలకు దుమ్ముపట్టదు, దుర్వాసనా ఉండదు. దీంట్లోని యాంటీ మైక్రోబియల్‌ లక్షణం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. రెండు వైపులా ఉపయోగించడానికి అనువుగా ఉంటాయి.

ప్రయాణాలకు అనువుగా: యోగాసనాలు వేసేటప్పుడు చెమట పడితే చిరాగ్గా ఉంటుంది కదా. ఈ చాపతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఇది తడిని చక్కగా పీల్చేసుకుంటుంది. ప్రయాణాల్లో దీన్ని టవల్‌గానూ వాడుకోవచ్చు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి