కొవిడ్‌ నుంచి కోలుకున్నారా? అయితే ఈ డైట్‌ ఛార్ట్‌ మీకోసమే!! - healthy food chart for post covid syndrome patients in telugu
close
Updated : 23/06/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ నుంచి కోలుకున్నారా? అయితే ఈ డైట్‌ ఛార్ట్‌ మీకోసమే!!

ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత తగ్గుతున్నప్పటికీ.. వైరస్‌ మాత్రం మన చుట్టూనే ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మహమ్మారి బారిన పడక తప్పదు. ఒకసారి కరోనా కోరలకు చిక్కామంటే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే! ఇదిలా ఉంటే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారిది మరో సమస్య. నెగెటివ్‌ వచ్చి రోజులు గడుస్తోన్నా చాలామందిలో ఒంటినొప్పులు, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా చెమట పట్టడం, నిద్రలేమి.. తదితర సమస్యలు తగ్గుముఖం పట్టట్లేదు. దీంతో వారు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. అయితే వీటన్నింటి నుంచి బయటపడాలంటే తీసుకునే పోషకాహారమే కీలకం అంటున్నారు నిపుణులు.

ఈ సిండ్రోమ్‌ను అధిగమించాలంటే!

వైరస్‌ ప్రభావంతో కోల్పోయిన రోగనిరోధక శక్తిని తిరిగి పెంపొందించుకోవడంలో పోషకాహారమే కీలకమని యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) చెబుతోంది. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కొవిడ్‌ అనంతర సమస్యలను త్వరగా అధిగమించవచ్చని ఆ సంస్థ సూచిస్తోంది.

 

ఎప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి?

* శరీరంలో తెల్ల రక్తకణాల్ని ఉత్పత్తి చేసి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సి-విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ పుష్కలంగా లభించే ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఉసిరి, పైనాపిల్‌.. వంటి నిమ్మజాతి పండ్లతో పాటు పాలకూర, ముల్లంగి, బ్రకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి.

* ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం/క్యారట్‌-బీట్‌రూట్‌ జ్యూస్‌/గ్రీన్‌ స్మూతీ/ పసుపు  పాలు/ అల్లం టీ/ గ్రీన్‌ టీ/ తులసి పానీయం.. తదితర ఆరోగ్యకరమైన పానీయాలను తప్పకుండా తీసుకోవాలి.

* ఉదయం పూట తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలనే తినాలి. ఓట్స్‌/కార్న్‌ఫ్లేక్స్‌/ఇడ్లీ/దోశ/బ్రౌన్‌ బ్రెడ్‌/గుడ్లు/వేయించిన కూరగాయలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ఉత్తమం.

* బ్రేక్‌ఫాస్ట్‌-లంచ్‌ మధ్యలో (మిడ్‌ మార్నింగ్‌ స్నాక్‌) ఏదైనా పండు తీసుకోవచ్చు. కమలాఫలం వంటి నిమ్మజాతి పండ్లైతే మరీ మంచిది.

* మధ్యాహ్న భోజనంలో భాగంగా రోటీ, రైస్‌, దాల్‌, సబ్జీ (కాయగూరలన్నీ కలిపి చేసే కూర), చట్నీ.. వంటివి తీసుకోవాలి.

* సాయంత్రం స్నాక్స్‌లోకి అవిసె గింజలు, బాదం, ఉడకబెట్టిన వేరుశెనగ, కాల్చిన శెనగలను చేర్చుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలా ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* రాత్రిపూట భోజనంలో వివిధ కూరగాయలతో చేసిన కిచిడీని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇది తేలికగా జీర్ణమవుతుంది. దీంతో పాటు నిద్రపోయే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం మర్చిపోవద్దు.

* రోజుకు కనీసం ఐదారు రకాల పండ్లు/కూరగాయల్ని ఆహారంలో చేర్చుకునేలా చూసుకోవాలి.

* రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకునేందుకు దానిమ్మ, దాల్చిన చెక్క, అల్లం, వాల్‌నట్స్‌, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని