ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికైంది.. ఊరికి పండగ కళ తెచ్చింది! - kashmiri girl selected for indian air force flying officer
close
Published : 23/09/2021 16:28 IST

ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికైంది.. ఊరికి పండగ కళ తెచ్చింది!

(Image for Representation)

మూడు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలందించిన తండ్రి అడుగుజాడల్లోనే తహీరా కూడా నడవాలనుకుంది. అందుకే ఊర్లో స్కూల్‌ లేకపోయినా చిన్నప్పుడే రోజూ 5 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి మరీ చదువుకుంది. అడ్డంకులు ఎదురైనా ఉన్నత చదువులు అభ్యసించి తన కలల ప్రయాణానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ క్రమంలోనే భారత వైమానిక దళం (IAF) ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికై తన సొంతూరికి పండగ శోభను తీసుకొచ్చింది.

ఆ వర్గం నుంచి మొదటి మహిళగా!

కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మావ్యా సూదన్‌ ఇండియర్‌ ఎయిర్‌ ఫోర్స్ ఫైటర్ పైలట్‌గా ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కశ్మీరీ మహిళగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మరో అమ్మాయి దేశం దృష్టిని తన వైపుకి తిప్పుకుంది. ఆమే తహీరా రెహ్మాన్‌. జమ్మూ కశ్మీర్‌లో బాగా వెనకబడిన గుజ్జర్ల వర్గానికి చెందిన ఆమె తాజాగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా నియమితురాలైంది. తద్వారా కశ్మీరీ గుజ్జర్ల వర్గం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, మావ్యా సూదన్‌ తర్వాత రాజౌరీ జిల్లా నుంచి ఐఏఎఫ్‌కు ఎంపికైన రెండో మహిళగా తహీరా చరిత్ర సృష్టించింది.

నాన్న అడుగుజాడల్లోనే!

రాజౌరీకి 145 కిలోమీటర్ల దూరంలోనున్న ఖోడ్‌బని అనే ఓ మారుమూల గ్రామం తహీరాది. తండ్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ మూడు దశాబ్దాల పాటు ఇండియన్ ఆర్మీలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి రకియా బేగమ్‌ గృహిణి. అభివృద్ధికి ఆమడదూరంలో నున్న ఖోడ్‌బనిలో స్కూల్‌ కూడా ఉండేది కాదు. అందుకే 5వ తరగతి వరకు రోజూ 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ పక్క ఊరిలోని పాఠశాలకు వెళ్లేది. ఆ తర్వాత ఉన్నత చదువులు అభ్యసించాలన్న లక్ష్యంతో జమ్మూ కంటోన్మెంట్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చేరింది. ‘మాది రాజౌరీ జిల్లాలో అత్యంత వెనకబడిన గ్రామం. ఇక్కడ స్కూల్‌ ఉండేది కాదు. అందుకే నా కూతురు రోజూ 4-5 గంటల పాటు ప్రయాణం చేసి మరీ పక్క ఊర్లోని పాఠశాలకు వెళ్లేది. పైలట్‌ అవ్వాలన్న కల తనకు చిన్నప్పటి నుంచే ఉంది. అందుకోసం ఎంతో కష్టపడింది. ఇప్పుడు ఆమె కల సాకారమైంది. మా ఆయన 30 ఏళ్ల పాటు ఇండియన్‌ ఆర్మీలో సేవలందించారు. ఇప్పుడు నా కూతురు కూడా మావారి అడుగుజాడల్లో నడవబోతున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది’ అని సంబరపడిపోతోంది తహీరా తల్లి రకియా బేగమ్.

పండగ శోభను తీసుకొచ్చింది!

ఈ క్రమంలో తహీరా ఘనతను చూసి అక్కడి గుజ్జర్లు, స్థానిక ప్రజలు, అధికారులు ఉప్పొంగిపోతున్నారు. స్వయంగా ఆమె ఇంటికొచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఐఏఎఫ్‌లో పైలట్‌ అవ్వడమంటే సాధారణ విషయం కాదు. అందులోనూ వెనకబడిన గ్రామాల నుంచి వచ్చిన అమ్మాయిలు ఆకాశంలోకి ప్రయాణించాలంటే ఎంతో శ్రమించాలి. తహీరాను చూసి మా గ్రామం, జిల్లాతో పాటు దేశమంతా గర్విస్తోంది. ఆమె నియామకం మా గ్రామానికి పండగ శోభను తీసుకొచ్చింది’ అని రాజౌరీ జిల్లా ప్రొటెక్షన్‌ లీగల్‌ అధికారి చెప్పుకొచ్చారు.


Advertisement


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని