అప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి! - pilot captain zoya agarwal to represent india for generation equality at un
close
Published : 15/08/2021 09:28 IST

అప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి!

(Photo: Instagram)

చిన్నతనంలో నింగిలోని చుక్కలు చూసి పైలట్‌గా మారాలనుకుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తన కలను సాకారం చేసుకుంది. ఇది చాలదన్నట్లు అతి చిన్న వయసులోనే బోయింగ్‌ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించిన విమానానికి సారథ్యం వహించి సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇలా ఎయిర్‌ ఇండియా కెప్టెన్‌ పైలట్‌గా ఎన్నో ఘనతలు అందుకున్న జోయా అగర్వాల్‌ తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా నియమితురాలైన ఆమె.. భవిష్యత్‌ తరాల సమానత్వం కోసం తన వంతు కృషి చేయనుంది.

17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా!

సాధారణంగా ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని నడపాలంటే ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. మైనస్‌ 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండే ఈ మార్గంలో విమానాలు నడిపేటప్పుడు తమ విమానయాన సంస్థలు ఎంతో అనుభవమున్న పైలట్లనే ఎంచుకుంటాయి. అయితే ఈ ఏడాది జనవరిలో మరో నలుగురు మహిళా పైలట్లను వెంటపెట్టుకుని ఏకధాటిగా 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి చరిత్ర సృష్టించింది జోయా అగర్వాల్. ఇదే కాదు.. కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో ఉన్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిందీ యంగ్‌ పైలట్‌.

ఈ క్రమంలోనే ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’ పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా జోయాను నియమించింది. ‘ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గొప్ప విషయం. అందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఈ అవకాశం కల్పించినందుకు ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, భారత ప్రభుత్వం, ఎయిర్‌ ఇండియాకు కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది జోయా.

మీ కలల వైపు ధైర్యంగా అడుగేయండి!

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని షేర్‌ చేసిన  జోయా... ‘అమ్మాయిలూ..మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు కూడా మీ కలల వైపు ధైర్యంగా అడుగేయండి. ఈ ప్రపంచమే మీకు తోడుగా నిలుస్తుంది... ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయద్దు. మన జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు మనకేదీ ఉత్తమమో అది సాధించి తీరాలి’ అని స్ఫూర్తి నింపింది.

అమ్మానాన్న భయపడ్డారు!

సాధారణంగా ఇంట్లో ఒక కూతురు/కొడుకు ఉంటే ఎంతో గారాబం చేస్తాం.. వారిని కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా చూసుకుంటాం. వారేదైనా సాహసం చేస్తామంటే వారికేమవుతుందోనన్న భయంతో అస్సలు ఒప్పుకోం. కొంతమంది తల్లిదండ్రులైతే మరీ భయపడిపోయి ఏడ్చేస్తుంటారు కూడా! తాను పైలట్‌ అవుతానని చెప్పినప్పుడు తన తల్లి కూడా ఇలాగే బాధపడిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది కెప్టెన్‌ జోయా.

‘మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం. దాంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగా. సాధారణంగా ఒక కూతురు/కొడుకు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్లే నా పేరెంట్స్‌ కూడా నా విషయంలో ఎంతో కేరింగ్‌గా ఉంటారు. అయితే నాకేమో సాహసాలు చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈ క్రమంలోనే పెద్దయ్యాక పైలట్‌ కావాలని చిన్నతనం నుంచి కలలు కనేదాన్ని. ఇదే విషయాన్ని ఓ రోజు అమ్మకి చెబితే భయపడింది. నాకేమవుతుందోనని ఒక్కసారిగా ఏడ్చేసింది. నాన్న కూడా ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని నిట్టూర్చాడు. అయితే కొన్నాళ్లకు అమ్మే నా లక్ష్యాన్ని, తపనను అర్థం చేసుకుంది. నా లక్ష్యం దిశగా నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ’

ఇంటర్వ్యూకు ముందు నాన్నకు గుండెపోటు!

‘నా తల్లిదండ్రుల కోసం డిగ్రీ చదువుతూనే ఏవియేషన్‌ కోర్సు పూర్తి చేశాను. అయితే ఈ కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నాను. అప్పుడే ఎయిర్‌ ఇండియాలో పోస్టులు పడ్డాయని తెలిసి ఎంతో సంతోషించాను. అయితే కేవలం 7 పోస్టులకు మూడు వేలమంది దరఖాస్తు చేశారని తెలిసి మొదట ఆందోళన చెందాను.. అయినా పట్టుదలతో ముందుకు సాగాను. ఇక ముంబయిలో నాలుగు రోజుల్లో ఇంటర్వ్యూ ఉందనగా నాన్నకు గుండెనొప్పి వచ్చింది. అయినా నాన్న ‘ జోయా...నువ్వు ముంబయికి వెళ్లు. ఇంటర్వ్యూలో విజయం సాధించి తిరిగిరా’ అంటూ ఆశీర్వదించి పంపాడు.’

అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి!

‘అలా అమ్మానాన్నల ప్రోత్సాహంతో అన్ని అడ్డంకులు దాటి ఎయిర్‌ ఇండియా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకున్నాను. 2004లో దుబాయికి మొదటి ఫ్లైట్‌ నడిపి చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాను. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. 2013లో బోయింగ్‌-777ను కూడా నడిపాను. ఇక నాకు పైలట్‌ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్‌ వచ్చినప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఒకప్పుడు ఈ రంగంలో చేరతానంటే బాధతో నిండిన ఆమె కళ్లలో అప్పుడు నాకు ధైర్యం కనిపించింది. ఇక భారత ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో వేలాదిమంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చాను. అదేవిధంగా ఈ ఏడాది ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపాను. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని విజయాలు’ అని గుర్తుకు తెచ్చుకుందీ యంగ్‌ పైలట్‌.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని