గాడిద పాలతో సౌందర్యోత్పత్తులు తయారుచేస్తోంది! - pooja kaul making skin care products from donkey milk in telugu
close
Published : 20/09/2021 16:01 IST

గాడిద పాలతో సౌందర్యోత్పత్తులు తయారుచేస్తోంది!

(Photo: Instagram)

ఆమెకు చదువు పెద్దగా అబ్బలేదు.. అయినా నలుగురిలో ఒకరిగా కాకుండా.. ‘ఒక్క’రిగా నిరూపించుకోవాలనుకుంది. ఈ ఆలోచనతోనే వ్యాపారం చేయాలనుకుంది.. కానీ అందరూ నీ వల్ల కాదని నిరుత్సాహపరిచారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది.. విజయం సాధించింది.. అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని చెబుతోంది. ఆమే.. దిల్లీకి చెందిన పూజా కౌల్‌. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేస్తూ డబ్బు సంపాదించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిలకు అపురూప లావణ్యాన్ని చేరువ చేస్తోంది. ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు..’ అని చెబుతోన్న పూజ.. తన స్టార్టప్‌, జీవితంలో తానెదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

అమ్మాయిలు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే.. ‘అమ్మాయివి.. ఇవన్నీ నీకెందుకు?!’ అని నిరుత్సాహ పరిచేవారే మన చుట్టూ ఎక్కువమంది ఉంటారు. నా విషయంలోనూ ఇదే జరిగింది. చిన్నతనం నుంచీ నాకు చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ నాకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండాలనుకున్నా. పది పాసవడమే గగనమైపోయింది. దానికి తగ్గట్లుగానే నా కుటుంబానికి కూడా నేనేదో సాధిస్తానన్న ఆశలేవీ లేవు. అయినా అవేవీ పట్టించుకోకుండా నా వంతు ప్రయత్నం నేను చేయాలనుకున్నా.

ఆ ఒక్క పదంతో..!

ఎట్టకేలకు బీఏ పూర్తిచేశాక సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ చేయాలనుకున్నా. కానీ అది నా లక్ష్యం కాదనిపించింది. దాంతో తర్వాత ఏం చేయాలో అర్థం కాక.. విభిన్న అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ చదివేదాన్ని. ఈ క్రమంలోనే ఆంత్రప్రెన్యూర్‌ అనే పదం నా కంట పడింది. ఇన్నాళ్లూ నేను వెతుకుతోన్న కెరీర్‌ లక్ష్యం ఇదే అనిపించింది. ఈ ఆలోచనతోనే 2016లో మహారాష్ట్రలోని TISS యూనివర్సిటీ నుంచి సోషల్‌ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్‌లో చేరా. ఇందులో భాగంగానే డైరీ ఇన్నొవేషన్‌పై ఓ ప్రాజెక్ట్‌ చేశా. అప్పుడే గాడిద పాల గురించి తెలుసుకున్నా. ఆవు పాలు, మేక పాలు పడని చిన్నారులకు ఇవెంతో మేలు చేస్తాయన్న విషయం అర్థం చేసుకున్నా. ఇదే విషయంపై ప్రజెంటేషన్‌ ఇస్తే అందరూ ఇదొక తెలివి తక్కువ ఆలోచన అంటూ కొట్టిపడేశారు.. నవ్వుతూ నన్ను హేళన చేశారు. దాంతో నా మనసు నొచ్చుకున్నా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా.

వచ్చిన ఉద్యోగం వదిలేశా!

గాడిద పాలతో ఇంకా కొత్తగా ఏం చేయచ్చని ఆలోచిస్తోన్న తరుణంలోనే ఈజిప్షియన్ల సౌందర్య రహస్యాలు గుర్తొచ్చాయి. క్లియోపాత్ర తన అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలో గాడిద పాలనే ఉపయోగించిందన్న విషయం మదిలో మెదిలింది. అంతే.. ఆ పాలతో సబ్బులు తయారుచేయడం మొదలుపెట్టా. నా పీజీ పూర్తయ్యే సరికి సుమారు 200 సబ్బులు తయారుచేశా. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినా.. సౌందర్యోత్పత్తుల వ్యాపారం చేయాలన్న ఆలోచనతో జాబ్‌లో చేరకుండా దిల్లీ వచ్చేశా.  బిజినెస్‌ అయితే చేయాలనుకున్నా.. కానీ అందుకోసం ఒక్క గాడిద కూడా కనిపించేది కాదు. ఈ అన్వేషణలో భాగంగానే ఇక్కడి Donkey Communityలో చేరా. వారికి ఓవైపు ఉపాధి కల్పిస్తూనే.. మరోవైపు ఆ పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేయడం మొదలుపెట్టా. ఈ క్రమంలోనే 2018లో ‘Organiko Beautifying Life’ పేరుతో స్టార్టప్‌ని ప్రారంభించా.

అన్నీ సహజసిద్ధమైనవే!

ఇలా నా బిజినెస్‌ను చూసి చాలామంది ‘ఆడపిల్లవి.. ఇవన్నీ నీకెందుకు?!’ అంటూ నిరుత్సాహపరిచారు.. ఇంకొంతమందైతే.. ‘కొత్త ఊపు ఇలాగే ఉంటుంది.. ముందు ముందు లాభాలు రాకపోతే నీకే తెలుస్తుంది..’ అంటూ దెప్పిపొడిచారు. వారందరికీ నా పనితోనే సమాధానం చెప్పాలనుకున్నా. నెమ్మదిగా నా ఉత్పత్తుల్ని సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేయడం ప్రారంభించా. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగా. ఇప్పుడు సబ్బులతో పాటు స్కిన్‌ ప్రొటెక్షన్‌ క్రీమ్స్‌, మాస్కులు.. వంటి అన్ని సౌందర్య ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి. ఇవన్నీ సహజసిద్ధమైనవే! వీటిలో కొన్ని ఆయుర్వేద పదార్థాలు, ఈజిప్ట్‌కు చెందిన సహజసిద్ధమైన పదార్థాల్ని సైతం వాడుతున్నాం. ఇవి అందాన్ని పెంచడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యల్ని సైతం దూరం చేస్తాయి. ప్రస్తుతం వ్యాపార రంగంలో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నా.

అందరికీ అందాన్ని చేరువ చేయడంతో పాటు అంతరించిపోతున్న ఈ మూగజీవాల్ని (గాడిదల్ని) రక్షించడానికి, ఇవే జీవనాధారంగా బతుకుతోన్న వారికి ఓ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..!


Advertisement


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని