తనలో ఓ అందమైన ప్రపంచం దాగి ఉంది! - ranveer singh gushes over wife deepika and says he is the proudest husband in the world
close
Published : 07/07/2021 20:18 IST

తనలో ఓ అందమైన ప్రపంచం దాగి ఉంది!

వెండితెరైనా... నిజ జీవితమైనా ‘మేడ్‌ ఫర్ ఈచ్‌ అదర్‌’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు దీపికా పదుకొణె-ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌. సందర్భమేదైనా, వేదికేదైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరీ లవ్లీ కపుల్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట తమ ముచ్చటైన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్‌ చేస్తుంటారు. తద్వారా నేటి తరం దంపతులకు రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతుంటారు. తాజాగా తన సతీమణిపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌వీర్‌. దీపిక భర్త అయినందుకు తానెంతో గర్వపడుతున్నానంటూ మురిసిపోయాడు.

పెళ్లికి ముందు ‘రామ్‌ లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి సినిమాల్లో జంటగా కనిపించి కనువిందు చేశారు దీపిక-రణ్‌వీర్. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుని నిజ జీవితంలోనూ అన్యోన్య దంపతులుగా మారిపోయారు. 2018లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను తెలుపుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి ఈ విషయంలో దీపిక కంటే రణ్‌వీర్‌ కాస్త ముందున్నాడని చెప్పుకోవచ్చు. తాను భార్యా విధేయుడినని... తన సతీమణి సంతోషమే తనకు ప్రాధాన్యమంటూ పలుసార్లు తన అర్ధాంగిపై ప్రేమను ఒలకబోశాడు రణ్‌వీర్‌. తాజాగా దీపిక తన వృత్తిగత, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులకు అందుబాటులో ఉంచేందుకు www.deepikapadukone.com పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీపిక గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన వివరాలన్నీ ఇందులో పొందుపరచారు. తాజాగా ఈ వెబ్‌సైట్‌ లాంఛింగ్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో దీప్‌వీర్‌తో పాటు ఫరాఖాన్‌, కబీర్‌ ఖాన్‌, సవ్యసాచి తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి తన తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు రణ్‌వీర్.

ఆమెలో ఓ అందమైన ప్రపంచం దాగుంది!

‘నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి దీపిక. ఆమె నా అర్ధాంగి కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. దీపిక తనలో తాను ఓ అద్భుతమైన, అందమైన ప్రపంచాన్ని కలిగి ఉంది. ప్రేమ, కరుణ, దయ, తెలివితేటలు, అందం, ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, సహృదయత... అన్నీ ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్నాయి. ఈ లక్షణాలే తనను ఓ అద్భుతమైన వ్యక్తిగా, ట్యాలెంటెడ్‌ నటిగా తీర్చిదిద్దాయి. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరు. అంతర్గత బలం, పట్టుదల, మానసిక స్థైర్యం మెండుగా ఉండే దీపిక స్వచ్ఛతకు, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆమెకు గౌరవమివ్వాలనుకుంటారు. నేనైతే తన ఆరాధనలో పడి ఒక్కోసారి ఆమెను చూస్తూ అలా ఉండిపోతుంటాను. దీపిక ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆమె పుట్టిందే ఇలా గొప్పగా నిలబడేందుకు. అందుకే ప్రపంచంలో కెల్లా నేను అత్యంత గర్వపడే భర్తనని ధైర్యంగా చెప్పుకోగలను’ అంటూ తన సతీమణిపై ప్రేమను కురిపించాడీ హ్యాండ్సమ్‌ హీరో.

పెళ్లి తర్వాత ఆన్‌స్ర్కీన్‌పై జంటగా కనిపించని దీప్‌వీర్‌ ‘83’ చిత్రంలో మళ్లీ జోడీగా దర్శనమివ్వనున్నారు. కపిల్దేవ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరెక్కిన ఈ సినిమాలో కపిల్‌ సతీమణి రోమీ భాటియా పాత్రలో కనిపించనుంది దీపిక. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని