ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే! - stove cleaning tips in telugu
close
Published : 26/08/2021 20:34 IST

ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే!

మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్ జిడ్డుగా మారుతుంది. మరి, ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని తళతళలాడించేద్దామా..

ఈ మిశ్రమంతో..

మీ ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా ఉన్నాయా..? ఇంకేం స్టవ్‌పై పేరుకున్న జిడ్డును సులభంగానే వదలగొట్టచ్చు. ఇందుకోసం స్టవ్ ఉపరితలంపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. ఆపై హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి కాసేపు వదిలేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్‌ని శుభ్రం చేస్తే సరి.. ఎంత మొండి మరకలైనా ఇట్టే వదలిపోతాయి. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి..

నూనెతో కడిగేయండి..

వెజిటబుల్ లేదా ఆలివ్ నూనెతో కూడా స్టవ్‌ని శుభ్రం చేయచ్చు. అదేంటి.. అసలే స్టవ్‌పై ఆయిల్ పడి జిడ్డుగా మారిందంటే.. మళ్లీ నూనెతో కడగమంటారేంటి..? ఇలా చేస్తే ఇంకా జిడ్డుగా మారుతుంది కదా.. అంటారా? అలా ఏం జరగదు. ఇందుకోసం.. ముందుగా స్టవ్‌పై వెజిటబుల్ లేదా ఆలివ్ నూనె కొద్దిగా చల్లాలి. కాసేపయ్యాక మెత్తటి వస్త్రంతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల స్టవ్‌పై దుమ్ము, ధూళి చేరి మొండిగా తయారైన మరకలు సులభంగా వదిలిపోతాయి. ఆ తర్వాత డిష్‌వాషర్ లేదా క్లీనర్‌తో శుభ్రం చేస్తే స్టవ్ మెరిసిపోతుంది.

మరిగే నీటితో..

ఇంట్లో స్టవ్ శుభ్రం చేయడానికి ఇతర పదార్థాలేవీ లేవు అంటారా..? అయినా స్టవ్‌ని సులభంగా క్లీన్ చేయచ్చు. అందుకోసం నీటిని బాగా మరిగించి స్టవ్ కుక్‌టాప్‌పై పోయాలి. ఇలా పోసిన నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాస్త డిష్‌వాషర్ లేదా ఏదైనా సోప్ వేసి స్క్రబ్బర్‌తో తోమితే సరి.. స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. స్టవ్ కూడా తళతళా మెరిసిపోతుంది.

వైట్ వెనిగర్‌తో..

ప్రస్తుతం చాలామంది ఇళ్లలో గ్లాస్ టాప్ స్టవ్‌లు వాడడం కామనైపోయింది. ఇలాంటి వారు స్టవ్‌పై పేరుకున్న జిడ్డును సులభంగా వదిలించుకోవడానికి వైట్ వెనిగర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక వంతు వైట్ వెనిగర్‌కి రెండు వంతుల నీటిని జతచేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ కుక్‌టాప్‌పై స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడవాలి. అంతే.. స్టవ్ మళ్లీ కొత్తదానిలా మెరిసిపోతుంది. ముఖ్యంగా వెనిగర్‌లోని ఆమ్లత్వం స్టవ్‌పై పేరుకున్న జిడ్డును త్వరగా వదిలించేస్తుంది. ఇలా ఈ మిశ్రమాన్ని మీరు రోజూ స్టవ్ శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

బేకింగ్ సోడా, నిమ్మకాయతో..

గ్లాస్ టాప్ స్టవ్ ఉన్న వారు స్టవ్ కుక్‌టాప్‌పై పడిన మరకలు, పేరుకున్న జిడ్డును బేకింగ్ సోడా, నిమ్మకాయ సహాయంతోనూ సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం గుప్పెడు బేకింగ్ సోడాను ముందుగా స్టవ్ కుక్‌టాప్‌పై చల్లాలి. ఆపై నిమ్మచెక్కతో రుద్దాలి. ఇప్పుడు ఓ తడిగుడ్డ సహాయంతో స్టవ్‌ని శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల స్టవ్ తళతళలాడుతుంది.

మరికొన్ని..

* ఉప్పు, బేకింగ్ సోడా.. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. దీనికి కొద్దికొద్దిగా నీటిని చేర్చుతూ పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న గుడ్డముక్క ముంచి దాంతో స్టవ్ మొత్తాన్నీ రుద్దాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా దీనిపై పూసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే స్టవ్‌కి అంటుకున్న జిడ్డు ఇట్టే తొలగిపోతుంది.

* ఒవెన్ క్లీనర్‌తోనూ స్టవ్‌ను శుభ్రం చేయచ్చు. ఇందుకోసం స్టవ్ బర్నర్స్, స్టాండ్స్‌ని తొలగించి ఆ ప్రదేశాన్ని న్యూస్ పేపర్లతో కవర్ చేయాలి. ఇప్పుడు ఒవెన్ క్లీనర్‌ని స్ప్రే చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.



మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని