మెడ వద్ద చర్మం బిగుతుగా ఇలా..! - ways to tighten your neck skin in telugu
close
Published : 26/07/2021 17:16 IST

మెడ వద్ద చర్మం బిగుతుగా ఇలా..!

వయసు పెరుగుతున్నా వన్నె తరగని సౌందర్యం సొంతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇది సాధ్యం కావాలంటే సౌందర్య సంరక్షణలో భాగంగా అదనంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరగడం కారణంగా మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతల్లా కనిపించడం.. వంటి సమస్యలు బాధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టడం ద్వారా వృద్ధాప్యఛాయలను దరి చేరనీయకుండా నవయవ్వనంగా కనిపించవచ్చు. అదెలా అంటారా?? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

చర్మంపై సన్నని గీతలు రావడం, ముడతలు పడడానికి కేవలం వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు. ఎక్కువగా సూర్యరశ్మి ప్రభావానికి గురికావడం, శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా ఉండడం.. వంటివి కూడా కారణమవుతాయి. ఈ క్రమంలో వీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెడ వద్ద చర్మాన్ని నిగారించేలా చేయచ్చు.

మృదువైన మర్దన..

ముందుగా గోరువెచ్చని నీళ్లతో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత నూనెరహిత క్లెన్సర్‌తో మరోసారి ముఖం, మెడ వద్ద క్లెన్సింగ్ చేయాలి. అనంతరం కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని చేతి మునివేళ్ల సహాయంతో ఈ నూనెను మెడ వద్ద అప్త్లె చేస్తూ పైకి, కిందకు రుద్దుతూ రెండు నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయాలి. ఇలా మెడ చుట్టూ ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజమైన తేమ అందడమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగా కూడా మారుతుంది.

వ్యాయామం..

మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా అక్కడ ఉన్న చర్మకణాలను పునరుత్తేజితం చేయవచ్చు. ఫలితంగా కొల్లాజెన్ ఉత్పత్త్తె అక్కడ చర్మం తిరిగి బిగుతుగా మారుతుంది. తద్వారా మెడ భాగం వద్ద చర్మంపై ఉండే ముడతలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వదులుగా మారిన చర్మం తిరిగి పటుత్వాన్ని సంతరించుకుంటుంది.

బ్యూటీ మాస్క్ సహాయంతో..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడడం, మృదువుగా మర్దన చేసుకోవడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారేందుకు కొన్ని మాస్క్‌లను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని..

తెల్లసొన, తేనెతో..

కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ అప్త్లె చేసుకోవడం ద్వారా వదులుగా మారిన చర్మం అతి తక్కువ సమయంలోనే తిరిగి బిగుతుగా మారుతుంది.

పెరుగు, నిమ్మరసంతో..

రెండు చెంచాల పెరుగులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. తర్వాత చేతి వేళ్ల సహాయంతో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తే చర్మం తిరిగి బిగుతుగా మారడమే కాదు.. ప్రకాశవంతంగానూ మారుతుంది.

కలబందతో..

కలబంద గుజ్జు, మయోనైజ్, తేనె.. ఈ మూడూ చెంచా చొప్పున ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా వేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో మెడపై ఉన్న ముడతలు తగ్గుతాయి.

కేవలం ఈ ప్యాక్స్ మాత్రమే కాదు.. పసుపు, తేనె, అరటిపండు, బొప్పాయి, కీరాదోస.. మొదలైనవి ఉపయోగించి తయారుచేసిన మాస్క్‌లు కూడా మెడ భాగంలో చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు ఉపయోగించవచ్చు.

పోషకాహారం కూడా..

మనం అందంగా కనిపించాలంటే మనం తీసుకునే ఆహారం కూడా అందుకు తోడ్పడే విధంగా ఉండాలి. ఈ క్రమంలో రోజూ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. మొదలైన పోషకాలన్నీ అందేలా సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తాజా పండ్లు, కూరగాయలు మన మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఒకేసారి ఎక్కువగా బరువు తగ్గడం కాకుండా క్రమంగా కొద్దికొద్దిగా తగ్గడం మంచిది. ఇవన్నీ చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపించేవే కాబట్టి వీటి విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు..

చూశారుగా.. మెడ భాగం వద్ద సాగిన చర్మం తిరిగి బిగుతుగా మారి నవయవ్వనంగా మెరిసిపోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో.. మీరు కూడా వీటిని గుర్తుపెట్టుకొని అనుసరించడానికి ప్రయత్నించండి. వయసు పెరుగుతున్నా తరగని అందాన్ని మీ సొంతం చేసుకోండి.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని