Viral Video: వీడేం డ్రైవర్‌రా బాబూ...!

ఆపేందుకు యత్నించిన టోల్ గేట్  సిబ్బందిని సైతం లెక్క చేయకుండా ఓ లారీ డ్రైవర్  నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. అమకతాడు టోల్ గేట్ వద్ద హరియాణా లారీని ఆపమని గుత్తి టోల్ గేట్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. లారీని ఆపేందుకు అమకతాడు టోల్ ప్లాజా ఉద్యోగి శ్రీనివాసులు యత్నించాడు. శ్రీనివాసులు లారీ ముందు భాగంపై ఎక్కినా డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే 10 కిలోమీటర్లు పోనిచ్చాడు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి శ్రీనివాసులును కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 26 Apr 2022 22:00 IST

Tags :

మరిన్ని