Viral Video: ధర్మవరం పురపాలక ఉద్యోగిపై కౌన్సిలర్‌ దాడి..!

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పురపాలక శాఖ ఉద్యోగి కృష్ణపై వైకాపా కౌన్సిలర్ రమణయ్య దాడి చేశారు. నాల్గో వార్డులో కొత్తగా నిర్మిస్తున్న ఒక ఇంటి నిర్మాణం రహదారి పైకి వచ్చిందని.. మున్సిపల్ అధికారులు జారీచేసిన నోటీసు కృష్ణ అందజేశారు. అక్కడికి వచ్చిన కౌన్సిలర్ రమణయ్య.. తనకు తెలియకుండా నోటీసులు ఎందుకిచ్చావంటూ దుర్భాషలాడుతూ.. చేయి చేసుకున్నారని ఉద్యోగి ఆరోపించారు. స్థానికులు ఈ దృశ్యాల్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.కౌన్సిలర్‌పై  సంబంధిత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 25 May 2023 15:14 IST

Tags :

మరిన్ని