Unstoppable: పార్టీ ఎందుకు.. తెదేపాలో చేరి ఉండొచ్చు కదా!

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయాల్లో ఆధిపత్య ధోరణి ఉంటుందని, ఎవరైనా ఎదుగుతుంటే, రానివ్వకుండా ఉండటం అనేది వారి వ్యూహంలో భాగమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. సీజన్‌-2లో భాగంగా పవన్‌కల్యాణ్‌తో ముచ్చటించారు. ఇప్పటికే పవన్‌ ఎపిసోడ్‌ తొలి భాగం స్ట్రీమింగ్‌ అవుతుండగా, రెండో భాగానికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ‘పార్టీ ఎందుకు.. తెలుగుదేశంలో చేరి ఉండవచ్చు కదా’? ‘సినిమాలు ఆపేసి, రాజకీయాలపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది ఏమంటారు’ లాంటి అనేక ఆసక్తికర ప్రశ్నలు బాలకృష్ణ అడగ్గా, పవన్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Updated : 05 Feb 2023 19:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు