Fitness Goals: ఫిట్‌నెస్‌పై ప్రేమతో.. వేదికపైనే పుష్‌అప్స్‌ చేసిన వధూవరులు
close

Published : 31/08/2021 00:10 IST
Fitness Goals: ఫిట్‌నెస్‌పై ప్రేమతో.. వేదికపైనే పుష్‌అప్స్‌ చేసిన వధూవరులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఆ నవ వధూవరులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఫిట్‌నెస్‌పై తమకున్న ఇష్టాన్ని చూపిస్తూ.. వివాహ వేదికపైనే పుష్‌అప్స్‌ చేసి ఔరా అనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

గురుగ్రామ్‌కు చెందిన అక్షిత అరోరా, ఆదిత్య మహాజన్ అనే యువతీ యువకులు ఫిట్‌నెస్‌ కోచ్‌లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. దీంతో వారు ఈ శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఫిట్‌నెస్‌, వ్యాయామంపై తమకున్న ఇష్టాన్ని ప్రదర్శిస్తూ.. అందరూ ఫిట్‌గా ఉండాలని సూచిస్తూ వివాహ దుస్తుల్లోనే వేదికపై పుష్‌అప్స్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 

మేకప్‌ ఆర్టిస్ట్‌ పారుల్‌ గార్గ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి దుస్తులు ధరించే వధువు పుష్‌అప్స్‌ చేయడం అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు మిలియన్‌ మంది వీక్షించారు. 78 వేల మంది లైక్‌ చేశారు. అయితే మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి..


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని