close

Published : 14/02/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీబ్రా క్రాసింగ్‌ కాదు.. కోబ్రా క్రాసింగ్‌!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిజీగా ఉన్న రోడ్లను, పాదచారులు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన నలుపు, తెలుపు చారలను జీబ్రా క్రాసింగ్‌ అంటారు. మరి ఈ ‘కోబ్రా క్రాసింగ్‌’ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? కర్ణాటకలోని ఉడుపి పట్టణం, కాల్సంకా కూడలిలో ఓ పాము హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది. అది వాహనాల క్రింద పడి నలిగిపోకుండా.. ట్రాఫిక్‌ పోలీసు రాకపోకలను తాత్కాలికంగా ఆపివేశాడు. మన్ను తిన్న దానిలా ఆ పాము నెమ్మదిగా కదులుతూ అవతలి వైపునకు చేరుకుంది. దీంతో అంతసేపూ వాహనదారులు ఓపిగ్గా వేచిచూడటం గమనార్హం.

కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఉడుపి పరిసర ప్రాంతాల్లో పచ్చదనం కనుమరుగు కావటంతో.. పాముల ఇతర ప్రాణులు వాటి సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ పోలీసు మంచి పనిచేశారంటూ పలువురు మెచ్చుకోగా.. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి పాములు రోడ్డు దాటేందుకు వీలుగా ‘కోబ్రా క్రాసింగ్‌’లను ఏర్పాటు చేయాలని సలహాలు ఇస్తున్నారు.

ఇవీ చదవండి..

 బోటుపై చేప దాడి..

తలకిందులైతే పొరపాటు లేదోయ్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు