Viral Video: సూదంటే భయం!
close

Published : 09/06/2021 23:33 IST
Viral Video: సూదంటే భయం!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో పలువురు తాము టీకా తీసుకున్నట్టుగా ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. టీకా వేసేటప్పుడు ఇంజక్షన్‌ భయం ఉన్నవాళ్లు మాత్రం చాలా హంగామా చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నవ్వులు పండిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన మాగ్యుల్‌ జూనియర్‌ అనే వ్యక్తి టీకా తీసుకోవడానికి భయపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నిలబడి ఉండగానే టీకా వేసినందుకు నర్సులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ, కొందరు మాత్రం వీడియో సరదాగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మాగ్యుల్‌కు సూపర్‌ ఫోబియా ఉందని, ఇంజెక్షన్లంటే భయమని అతని స్నేహితుడు చెబుతున్నాడు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని