
ఇంటర్నెట్ డెస్క్: లైవ్ కార్యక్రమం కొనసాగుతుండగానే ఓ ఘరానా దొంగ టీవీ ఛానెల్ సిబ్బంది, విలేకర్లను దోచేశాడు. ఈక్వెడార్‌లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనమైంది. పట్టపగలు, బహిరంగంగా వారిని తుపాకీతో బెదిరించి.. వారి వద్దనున్న డబ్బు, వస్తువులు దోచుకోవటం అందులో చూడొచ్చు.
డిగో ఆర్డినోలా అనే క్రీడా డైరెక్ట్ టీవీ స్పోర్ట్స్ అనే మీడియా సంస్థలో పనిచేస్తాడు. ఆయన ఇక్కడి గువాయాక్విల్ పట్టణంలోని ఎస్డాడియో మాన్యుమెంటల్ భవనం వద్ద లైవ్‌లో సమాచారం అందిస్తుండగా.. ఓ దొంగ ఆ ప్రసారానికి అడ్డువచ్చాడు. మాస్క్ ధరించిన అతను ఆర్డినోలా వైపు రివ్వాల్వర్ గురిపెట్టాడు. మైక్రోఫోన్‌ను లాగేసి ‘‘టెలిఫోన్’’ అంటూ అరిచి దానిని సొంతం చేసుకున్నాడు. అనంతరం అక్కడున్న మిగిలిన సిబ్బంది వైపు తుపాకీ గురిపెట్టి వారి ఫోన్లు, పర్సులు కూడా తీసుకున్నాడు. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయింది. ఆ తర్వాత రోడ్డువైపు పరిగెత్తిన దొంగ .. అక్కడ సిద్ధంగా ఉన్న మోటార్ సైకిల్ వెనుక కూర్చుని ఉడాయించాడు.
‘‘మేము కనీసం ప్రశాంతంగా పని కూడా చేసుకోలేకపోతున్నాము. ఇది మధ్యాహ్నం 1:00 గంటకు మాన్యుమెంటల్ స్టేడియం వెలుపల జరిగింది.’’ అంటూ ఆ విలేకరి సామాజిక మాధ్యమాల్లో వాపోయాడు. కాగా పోలీసులు ఆ దొంగను పట్టుకుంటామని హామీ ఇచ్చారట.
మరిన్ని
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్