Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
మనోళ్లు మహాముదుర్లు
కోట్లు ఖర్చుపెట్టి లక్షలు చూపించేశారు
ఏపీలో ఎంపీల సగటు ఖర్చు రూ.14 లక్షలేనట
2009 ఎన్నికల లెక్కల విశ్లేషణలో కళ్లు తిరిగే అబద్ధాలు
ఈనాడు - న్యూఢిల్లీ
న్నికల్లో నెగ్గాలంటే కోట్ల రూపాయల్ని ధారపోయాల్సిందేనని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. అసెంబ్లీకి అయిదు కోట్లు, లోక్‌సభకు రూ.20 కోట్ల దాకా ధారపోయాల్సిందేనని రాజకీయ నాయకులే చెబుతుంటారు. బహిరంగ సభలు, బ్యానర్లు, మీడియాలో ప్రకటనలకు డబ్బును నీళ్లలా ఖర్చుచేస్తున్న మన ఎంపీలు ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టి కాకిలెక్కలు సమర్పిస్తున్నారు. 2009 ఎన్నికల్లో మన రాష్ట్రంలోని ఎంపీలకు అయిన సగటు ఖర్చు రూ.14 లక్షలేనట! దీన్నిబట్టి చూస్తే వారు ఒక్కో కోటిని లక్షగా మార్చేసి లెక్కలు సమర్పించేసినట్లు కనిపిస్తోంది. దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయంచేసే రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ ఈసీ ముందుకు వచ్చిన లెక్కల్లో మాత్రం 12వ స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి చూస్తే మన రాజకీయ నాయకులు ఎంతటి మహాముదుర్లో అర్థమవుతుంది. ఎన్నికల ఖర్చు నానాటికీ పెరిగిపోతున్నందున వ్యయ పరిమితి పెంచాలని ఎన్నికల సంఘంపై వివిధ పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చి 2014 లోక్‌సభ ఎన్నికల గరిష్ఠ పరిమితిని రూ.70 లక్షలకు పెంచేలా చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో గరిష్ఠ వ్యయ పరిమితి రూ.25 లక్షలే ఉన్నప్పటికీ అందులో తమకు కనీసం 50 శాతం కూడా ఖర్చుకాలేదంటూ 30 శాతం మంది ఎంపీలు ఎన్నికల సంఘానికి కాకి లెక్కలు సమర్పించేశారు. క్షేత్ర స్థాయిలో కోట్లు గుమ్మరించే వీరు ఎన్నికల సంఘానికి మాత్రం కళ్లు తిరిగే లెక్కలు సమర్పిస్తున్న విషయం ఏడీఆర్‌ సంస్థ విశ్లేషణలో వెల్లడైంది. 2009 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎంపీలు సమర్పించిన లెక్కలను చూస్తే ఒక్కో ఎంపీకి అయిన సగటు ఖర్చు కేవలం రూ.14.62 లక్షలు మాత్రమేనట. అంటే నాటి రూ.40 లక్షల గరిష్ఠ వ్యయ పరిమితిలో ఇది కేవలం 59% మాత్రమే!! ఎన్నికల సంఘం పరిమితి ఎంతైనా ఫర్వాలేదు... అందులో 50 శాతం చూపించేద్దాం అన్నట్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు 50% కంటే తక్కువ లెక్కలు చూపించేశారు.
2009 ఎన్నికల తర్వాత 437 మంది ఎంపీలు సమర్పించిన ఖర్చు లెక్కలను నేషనల్‌ ఎలెక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ సంస్థలు విశ్లేషించినప్పుడు అవాక్కయ్యే వాస్తవాలు బయటపడ్డాయి.

*2009 ఎన్నికల తర్వాత 437 మంది ఎంపీలు సమర్పించిన లెక్కలను పరిశీలిస్తే అందులో 129 మంది(30%) తమకు ఎన్నికల వ్యయ పరిమితిలో 50 శాతంకంటే తక్కువ ఖర్చే అయినట్లు చూపించారు.

*దేశవ్యాప్తంగా ఎంపీలందరి ఖర్చులను సగటు చేస్తే ఒకొక్కరికి కేవలం రూ.14.62 లక్షలు మాత్రమే వ్యయమైంది.

*317 మంది ఎంపీలు(73%) తమకు సొంత రాజకీయ పార్టీలేమీ నిధులు సమకూర్చలేదని చెప్పారు. 120 మంది(27%) మాత్రం తమకు టికెట్లు ఇచ్చిన పార్టీలు కొంతమేర నిధులు కూడా సమకూర్చినట్లు తెలిపారు. ఇందులో 15 మంది(3%) తమకు అయిన ఖర్చు పూర్తిగా పార్టీలే భరించినట్లు వెల్లడించారు.

* భాజపాకు చెందిన 35 మంది ఎంపీలు సమర్పించిన లెక్కల ప్రకారం ఆ పార్టీ ఒక్కొక్కరికి సగటున రూ.5.08 లక్షల నిధి(వారి సగటు వ్యయంలో ఇది 36%) సమకూర్చింది. కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎంపీలు చూపిన లెక్కల ప్రకారం ఆ పార్టీ సగటున రూ.5.61 లక్షల(అభ్యర్థుల సగటు వ్యయంలో 36%) నిధి అందించింది.

* దేశంలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఖర్చయినట్లు చూపించారు. అందులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ఉన్నారు. 2009లో కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన తనకు రూ.26.73 లక్షలు(పరిమితికంటే 7% ఎక్కువ) ఖర్చయినట్లు చూపించారు. అదే రాష్ట్రంలోని ఇటావా నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరుఫున పోటీచేసిన ప్రేమ్‌దాస్‌ రూ.57.39 లక్షల ఖర్చు(130% అధికం) చూపారు.

* రాష్ట్రాల వారీగా చూస్తే త్రిపురలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సగటు వ్యయం కనిపించింది. ఇక్కడ ఒక్కో అభ్యర్థికి రూ.18.79 లక్షలు వ్యయమైంది. ఆ తర్వాత జార్ఖండ్‌లో సగటున రూ.18.73 లక్షలు, ఉత్తరాఖండ్‌లో రూ.18.49 లక్షలు, అస్సాంలో రూ.17.77 లక్షలు వ్యయమైంది. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు అయిన సగటు వ్యయం రూ.14 లక్షలు. అత్యధికంగా ఖర్చుచేసిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం 12వ స్థానంలో నిలిచింది.

త్యధిక వ్యయం చేసిన ఎంపీలుగా ముగ్గురు నిలిచారు. అందులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రేమ్‌దాస్‌ (రూ.57.39 లక్షలు), అఖిలేష్‌ యాదవ్‌ (రూ.26.73 లక్షలు), బీజేడీకి చెందిన యశ్వంత నారాయణ్‌ సింగ్‌ లగూరి (రూ.24.97 లక్షలు) ఉన్నారు.
నాగాలాండ్‌ నుంచి పోటీచేసిన సీఎం చాంగ్‌ అనే అభ్యర్థి తనకు కేవలం రూ.1.31 లక్షలు(వ్యయ పరిమితిలో 5%) మాత్రమే ఖర్చయినట్లు చూపించారు. ఇది దేశంలో అత్యల్ప వ్యయం. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రవ్‌నీత్‌సింగ్‌ రూ.1.75 లక్షలు(7%), లక్షద్వీప్‌ నుంచి పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి పీఎం సయీద్‌ తనయుడు ఎం.ఎ.సయీద్‌ కేవలం రూ.2.02 లక్షల(20%) ఖర్చు చూపించారు.
* 33 మంది ఎంపీలు తాము బహిరంగ సభలు, వూరేగింపుల కోసం కనీసం పైసా కూడా ఖర్చుచేయలేదని తేల్చేశారు.
* 123 మంది ఎంపీలు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం కోసం పైసా కూడా ఖర్చ చేయలేదట.
* 418 మంది ఎంపీలు తాము కార్యకర్తల కోసం పైసా కూడా వ్యయం చేయలేదని చెప్పారు.
* 22 మంది ఎంపీలు వాహనాల కోసం తాము ఏమీ ఖర్చుచేయలేదని వెల్లడించారు.
* 21 మంది ఎంపీలు తాము జెండాలు, బ్యానర్లు, కటౌట్‌ల కోసం పైసా కూడా ఖర్చుచేయలేదని తెలిపారు.
* పార్టీలవారీ లెక్కలను చూస్తే కాంగ్రెస్‌ మొదటి స్థానంలో నిలిచింది. 161మంది ఎంపీలపై ఒకొక్కరికి సగటున రూ.14.38 లక్షలు ఖర్చుచేసింది. భాజపా 91మందిపై సగటున రూ.14.43 లక్షలు పెట్టింది. 21మంది ఎంపీలపై సమాజ్‌వాదీ సగటున రూ.19.48 లక్షలు, 19 మంది ఎంపీలపై బీఎస్పీ సగటున రూ.14.72 లక్షలు ఖర్చుచేసింది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net