Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఐదేళ్లలో రూ.45,366 కోట్లు!
పట్టణాలకు పెట్టుబడులు అవసరం
అంచనా వేస్తున్న సర్కారు
ఆస్తి పన్నే ప్రధాన ఆదాయ మార్గం
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లోని నగర పాలక, పురపాలక సంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన పెట్టుబడులపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోంది. రానున్న ఐదేళ్లలో 92 మున్సిపాలిటీలు, 13 నగర పాలక సంస్థల్లోని 1.4 కోట్ల మందికి పైపులైన్ల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటిపారుదల నిర్వహణ, వీధి దీపాలు, పచ్చదనం, వరదనీటి కాలువల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాల్లో పెరుగున్న జనాభా, భవిష్యత్తు అవసరాలు మేరకు ఇప్పటికే 2031 నాటికి రూ.61,100 కోట్లు అవసరమని భావిస్తోంది. ఇందులో 2019 నాటికి తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, మరుగుదొడ్లు, మెట్రో రైళ్లు, ప్రజా రవాణా, రోడ్లు, ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.45,366 కోట్లు కావాలని లెక్క కట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులను ఏ విధంగా సమీకరించాలన్న విషయమై ఇప్పటికే సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. పురపాలక సంస్థల్లో రక్షిత తాగునీటి కోసం ప్రపంచబ్యాంకు, జైకా, ఏడీబీ, డీఎఫ్‌ఐడీ తదితర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేసింది. తాగునీటి అవసరాలకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం రూ.14 వేల కోట్లతో నివేదిక సిద్ధం చేసింది. పట్టణాల్లో తాగునీటి ప్రాజెక్టులకోసం రూ.29,971 కోట్లు అవసరమని భావిస్తోంది. ఇందులో రూ.8,021 కోట్లు మూలధన పెట్టుబడి కాగా, మరో రూ.22,155 కోట్లు నిర్వహణకు వెచ్చించాల్సి వస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రజా మరుగుదొడ్ల కోసం రూ.2502 కోట్లు ఖర్చు చేయనుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను చేపట్టాలని నిర్ణయించింది. ఆయా వ్యవస్థల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేయాలని దిల్లీ మెట్రో సంస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ఈ మెట్రో వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ కోసం రానున్న ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది.

ఆస్తి పన్ను కీలకం.. పుర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆస్తి పన్ను ఆదాయం కీలకం కానుంది. ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తి పన్నుతో పాటు పట్టణాల్లోని ఇతరత్రా ఆదాయ మార్గాలను అన్వేషించాలని నిర్ణయించింది. ఆస్తి పన్ను వసూళ్లను సరళీకృతం చేయడం, జీఐఎస్‌ విధానంలో పన్ను మదింపు ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలని భావిస్తోంది. పుర సేవలపై రుసుములు, వినియోగ ఛార్జీల వసూళ్లు నూరు శాతం ఉండాలని, అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి పారుదల తదితర సేవలపై వినియోగ రుసుములు విధించాలని ఆలోచన చేస్తోంది.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net