Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
తెలంగాణలో 5 కొత్త విశ్వవిద్యాలయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం
రూసాకు ప్రతిపాదనలు సిద్ధం
ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్య విస్తరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా)కు ప్రతిపాదనలు పంపబోతున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఐదు కొత్త విశ్వవిద్యాలయాల్లో మూడింటిని ప్రస్తుతం ఉన్న కళాశాలల స్థాయిని పెంచటం ద్వారా ఏర్పాటు చేయటం; అవి- 1. ఆదిలాబాద్‌, ప్రభుత్వ డిగ్రీకళాశాల; 2. సీయూ-జీడీసీ, సిద్ధిపేట, మెదక్‌జిల్లా; 3. కేయూ పీజీ సెంటర్‌ కొత్తగూడెం, (మైనింగ్‌లో ప్రత్యేక వర్సిటీ). కొన్ని కళాశాలలను కలిసి విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయటం. వీటినే క్లస్టర్‌ యూనివర్సిటీలంటారు. ఈ తరహావి 2 విశ్వవిద్యాలయాలు. క్లస్టర్‌ 1. హైదరాబాద్‌ జిల్లా; దీనికింద నయాపూల్‌ ప్రభుత్వ సిటీ కాలేజీ; ప్రభుత్వ డిగ్రీకాలేజీ-హుస్సేని ఆలం; ప్రభుత్వ మహిళల డిగ్రీ కాలేజీ-నాంపల్లి; ప్రభుత్వ డిగ్రీకాలేజీ- బేగంపేట; ప్రభుత్వ డిగ్రీకాలేజీ - ఖైరతాబాద్‌. క్లస్టర్‌-2: నల్గొండ జిల్లా. దీనికింద ప్రభుత్వ డిగ్రీకళాశాలలు- నల్గొండ; ప్రభుత్వ డిగ్రీకాలేజీ- రామన్నపేట; ప్రభుత్వ డిగ్రీకాలేజీ-నకిరేకల్‌.

ఆ మూడింటిలో మినహా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు మినహాయించి ప్రతి జిల్లాలో ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను ఆరంభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వీటిలో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్‌ (మెదక్‌ జిల్లా)లో ఒకటి. మిగిలినవి కరీంనగర్‌; నిజామాబాద్‌; సూర్యాపేట (నల్గొండజిల్లా); నాగర్‌కర్నూల్‌ (మహబూబ్‌నగర్‌); వరంగల్‌ (మహిళా కళాశాల), ఆదిలాబాద్‌ల్లో ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు... ఆదిలాబాద్‌ జిల్లా ప్రభుత్వ డిగ్రీకళాశాలను కొత్త ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతారు. మంచిర్యాల మహిళల డిగ్రీ కళాశాలతో పాటు; షాద్‌నగర్‌ (మహబూబ్‌నగర్‌), పటాన్‌చెరు (మెదక్‌), మోర్తాడ్‌ (నిజామాబాద్‌) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఆదర్శ కళాశాలలుగా స్థాయిని పెంచాలనుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా ప్రణాళిక (స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌-షెప్‌)గా పేర్కొనే ఈ ప్రతిపాదనలను ఢిల్లీలోని రూసాకు సమర్పిస్తారు. ఈ లోపు రాష్ట్రంలో రూసాకు సంబంధించిన స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకూ సీఎం ఆమోదం తెలిపారు. కళాశాల విద్య కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రస్తుతం ఎస్పీడీగా వ్యవహరిస్తారు. ఎస్పీడీలోని ఇతర సభ్యులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. వీటితోపాటు నోడల్‌ అధికారిని కూడా ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఎవరో ఒకరు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆ రాష్ట్ర మండలి ఉపాధ్యక్షుడు విజయప్రకాశ్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీడీ, నోడల్‌ అధికారి ఉమ్మడి బ్యాంక్‌ ఖాతాలోనే కేంద్రం నుంచి వచ్చే రూసా నిధులు జమవుతాయి. ఎస్పీడీ తరఫున ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రణాళికను రూసాలోని ప్రాజెక్టు అనుమతి మండలి (పీఏబీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఆ మండలి సంతృప్తి చెందితే అనుమతి లభిస్తుంది. ఆపై నిధుల మంజూరు జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.2500 కోట్ల మేర రూసా ప్రతిపాదనలు పంపించగా... విభజన తర్వాత విడివిడిగా సమర్పించిన అంచనాల ప్రకారం తెలంగాణలో సుమారు రూ.1300 కోట్ల మేర ప్రతిపాదనలున్నట్లు తెలిసింది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net