Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యం
‘మిషన్‌ కాకతీయ’ మార్గదర్శకాలు జారీ
ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయలో గొలుసుకట్టు చెరువులకు, పూడిక తీసుకెళ్లడానికి రైతులు అంగీకరించిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లందరికీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా చేపట్టాలి, ఏయే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి, నాణ్యత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర వివరాలతో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక చెరువును రిక్రియేషన్‌ పార్కు, మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి. ఐదేళ్లలో చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తి చేయడానికి వీలుగా ఏమేం చర్యలు తీసుకోవాలో ఇందులో వివరించారు...
* నీటి లభ్యత ఉండి, ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* రైతులు తమ సొంత ఖర్చుతో పూడిక తీసుకెళ్లి పొలాల్లో వేసుకోవడానికి అంగీకరించినవి.
* మొదటిదశలో మండలంలోని గొలుసుకట్టు చెరువులను గుర్తించాలి. ప్రతి చెరువుకు ఫీడర్‌ ఛానల్‌తో సహా అంచనాలు తయారు చేయాలి.
* నాణ్యతా పనులను క్రమం తప్పకుండా పరిశీలించాలి. పని ప్రారంభానికి ముందు, చేసేటప్పుడు, పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఫోటలను తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
* పూడికతీత, ఫీడర్‌ ఛానళ్ల పునరుద్ధరణ, గట్టు పటిష్ఠత, తూములు, అలుగు మరమ్మతులు, అవకాశం ఉన్నచోట సామర్థ్యం పెంచాలి.
* అంచనాలు ప్రస్తుత ఎస్‌.ఎస్‌.ఆర్‌ ప్రకారం తయారు చేయాలి.
* ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో చేపట్టే చెరువుల కింద కనీసం 40 శాతం మంది ఎస్టీలు ప్రయోజనం పొందేలా ఉండాలి.
* సాంకేతిక అనుమతి ఇచ్చే ముందు రూ.కోటి వరకు ఈఈ, రూ.ఐదుకోట్ల వరకు ఎస్‌ఈ, రూ.5 కోట్లకు పైన విలువగల పనులను చీఫ్‌ ఇంజినీర్‌ పరిశీలించాలి. రూ. 50 లక్షల వరకు ఈఈ, రూ.కోటి వరకు ఎస్‌ఈ, రూ.పది కోట్ల వరకు సీఈ.. టెండర్లను ఆమోదించవచ్చు. రూ.పది కోట్లకు మించితే సీఓటీకి రావాల్సి ఉంటుంది.
* అంచనాకు 5 శాతానికి మించి దాఖలు చేసే వాటిని తిరస్కరించాలి. అంచనా కంటే పది శాతం తక్కువకు దాఖలు చేస్తే అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌ అవసరం లేదు. పది శాతానికి దాటి తక్కువకు కోట్‌ చేస్తే అదనపు డిపాజిట్‌ చెల్లించాలి. టెండర్‌ సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే తిరస్కరించాలి. టెండర్‌ సమయంలో ఎలాంటి సంప్రదింపులకు ఆస్కారం లేదు.
* పూడికను మొదటే అంచనా వేయాలి. చెరువు బెడ్‌ లెవల్‌, నీటిలభ్యత వివరాలను సిద్ధం చేయాలి.
* చెరువుల్లో నీళ్లుంటే పూడికపై తాత్కాలిక అంచనా వేయవద్దు. చెరువులో నీటి వినియోగం తర్వాతే తీయాల్సిన పూడికను అంచనా వేయాలి.
* పూడికతీతకు క్యూబిక్‌మీటర్‌కు రూ.40.10 చెల్లించాలి. రైతులు సొంత ఖర్చుతో పూడిక తీసుకెళ్లగా మిగిలినదానికి కిలోమీటర్‌ దూరం వరకు తీసుకెళ్లి వేయడానికి అదనంగా రూ.31.40 చెల్లించాలి.
* చెరువుపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేయాలి. గ్రామసభలు, కళాజాతాలు నిర్వహించాలి.
* చెరువుల పునరుద్ధరణకు ఆర్థికసాయం చేయడానికి ఆసక్తిగా ఉన్నవారిని గుర్తించాలి.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net