Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
నిమ్స్‌ కీళ్లవ్యాధుల విభాగం గుర్తింపు రద్దు!
మూత్రపిండవ్యాధులు, హృద్రోగ విభాగాల్లో సీట్ల తగ్గింపు
ఎంసీఐ నిర్ణయంపై అభ్యంతరాలతో లేఖ రాసిన నిమ్స్‌
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నిజామ్‌ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్‌)లో రుమటాలజీ విభాగానికి గుర్తింపును భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) రద్దుచేసింది. ఈ విభాగాధిపతికి అవసరమైన అర్హతలు లేవంటూ, ఇతర కారణాలూ పేర్కొంటూ రుమటాలజీ డీఎం సీట్ల రద్దుకు నిర్ణయించింది. నెఫ్రాలజీ( మూత్రపిండ వ్యాధుల విభాగం), కార్డియాలజీ(హృద్రోగ) విభాగాల్లో డీఎం సీట్లనూ తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రతిగా ఎంసీఐ వైఖరిపై తీవ్ర అభ్యంతరం చెబుతూ నిమ్స్‌ ఇటీవలే దానికి తిరిగి లేఖ రాసింది.

దేశంలోనే నిమ్స్‌ ఆసుపత్రిలోని రుమటాలజీ(కీళ్ల సంబంధిత వ్యాధుల) విభాగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రయోగశాల మూతపడడంతో పరిశోధనలు కరవయ్యాయి. విభాగంలో అంతర్గత ఘర్షణల కారణంగానే ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. గత నెలలో జరిగిన ఎంసీఐ కార్యనిర్వాహక సమావేశంలో దేశంలోని పలు ఆసుపత్రుల్లో పీజీ, డీఎం సీట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నిమ్స్‌లో రుమటాలాజీ విభాగంలో ప్రస్తుతమున్న మూడు డీఎం సీట్లను రద్దుచేయాలని నిర్ణయించారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల్లోనూ డీఎం సీట్ల సంఖ్యలో కోత పెట్టారు. నెఫ్రాలజీలో ఒకటి నుంచి రెండు సీట్లకు పెంచుతూ, కార్డియాలజీ విభాగంలో 2 నుంచి 6 సీట్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్లు తెలుస్తోంది. సీట్ల రద్దుకు ఎంసీఐ వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో లోపాలను తిరస్కరిస్తూ ఇటీవలే నిమ్స్‌ లేఖ రాసింది. రుమటాలజీ విభాగ రద్దుకు ప్రధాన కారణంగా విభాగాధిపతికి అవసరమైన అర్హతల్లేవని పేర్కొంది. ఈ అభ్యంతరాన్ని నిమ్స్‌ ఆక్షేపించింది. వైద్య కళాశాలల్లో ఎంసీఐ తనిఖీలకు పనికొచ్చే ఈ ఆచార్యునికి విభాగాధిపతిగా అర్హతలు లేవనడమేంటని నిలదీసింది. ఈ విషయంపై నిమ్స్‌ వర్గాలు మాట్లాడుతూ..‘‘మూత్రపిండ వ్యాధులకు సంబంధించి రెండు విభాగాలకూ కలిపి ఆరుగురు వైద్యులుండాలి. అందరూ ఉన్నారు. అయితే తనిఖీలు నిర్వహించిన అధికారులు తమ నివేదికల్లో 2+4 అని రాసుకెళ్లారు. దీంతో ఒక విభాగానికి వైద్యుల కొరత ఉందనే కారణంతో సీట్లు తగ్గించారు. అలాగే రుమటాలజీ విభాగం కూడా. ఈ విభాగపు ఆచార్యులు తరచూ ఎంసీఐ తనిఖీలకు వెళ్తుంటారు. ఇప్పుడు ఆమెకే అర్హతలేదంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక కారణాలను అడ్డుపెట్టి, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లపై కోతపెడుతున్నారు. వీటన్నింటిపై మేం సవివరంగా అభ్యంతరాలు చెబుతూ.. వాస్తవాలను వివరిస్తూ నివేదిక పంపాం. ఎంసీఐ సానుకూలంగా స్పందించి, సీట్లను పునరుద్ధరిస్తుందనే భావిస్తున్నాం.’’ అని పేర్కొన్నాయి.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net