Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ప్రైవేటు భాగస్వామ్యంతో 104
టెండర్ల ద్వారా సంస్థ ఎంపిక
సర్కారు యోచన
ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్న సంచార వైద్య సేవల(104)ను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 104 వాహన సేవలు అధ్వానంగా కొనసాగుతుండడంతో... పాత పద్ధతిలోనే తిరిగి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని భావిస్తోంది. టెండర్ల విధానంలో పూర్తి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలన్న యోచనలో ఉంది. 108 వాహన సేవల మాదిరిగా 104 వాహన సేవలనూ ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించడం వల్ల మెరుగైన వైద్య సేవలందించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత సేవల కంటే మరిన్ని సేవలను అదనంగా చేర్చి.. నెలలో అన్నిరోజులూ వాహనాలు పర్యటించేలా చర్యలు తీసుకోవాలనీ, వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను కూడా ప్రైవేటుకే అప్పగించాలనీ, ప్రస్తుతం పొరుగు సేవల్లో పనిచేస్తున్న 104 సిబ్బంది... ప్రైవేటు సంస్థలో కొనసాగడానికి ఆసక్తి చూపిస్తే వారికే ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచన కూడా ఉంది. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

లోపమెవరిది: గ్రామీణ ప్రాంతాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్థమా, మూర్చ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వారి వూళ్లలోనే నెలనెలా వైద్య పరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా ఔషధాలను ఒకేసారి ఇచ్చే బృహత్తర పథకమే.. 104 వాహన సేవలు. ప్రతి నెలా మొదటి తేదీ నుంచి 20 వరకూ నిర్దేశించిన పల్లెల్లో ఈ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. సిబ్బంది జీతాలు, డీజిల్‌, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో వాహనానికి నెలకు రూ.1,04,173 చొప్పున ఏడాదికి మొత్తం సుమారు రూ.24 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. వీటికి అదనంగా ఒక్కో వాహనానికి సుమారు రూ.40వేల విలువ చేసే ఔషధాలను సరఫరా చేస్తోంది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాల్లో 104 సేవలందించడానికి 200 వాహనాలున్నాయి. ప్రస్తుతం సగానికి పైగా 104 వాహనాలు మరమ్మతులతో రోడ్డెక్కలేని పరిస్థితులున్నాయి. వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక నిధులు సకాలంలో అందక డీజిల్‌ సమస్యలతో ఆగిపోతున్న వాహనాలూ అనేకం ఉన్నాయి. ఔషధాల కొరత కూడా తీవ్రంగా ఉంది. అంతిమంగా గ్రామీణ ప్రాంత రోగులకు వైద్యసేవలు అందకుండాపోతున్నాయి.

ఆరంభంలో పీపీపీనే...: ఈ పథకాన్ని 2007లో ప్రారంభించిన నాటి నుంచి 2011 వరకూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనే నిర్వహించారు. అయితే ప్రైవేటు నిర్వహణలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవడంతో అప్పటి ప్రభుత్వం 104 సేవలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొంది. ప్రభుత్వం బాధ్యత స్వీకరించినా.. వైద్యులు మినహా ఇతర నియామకాలన్నీ పొరుగు సేవల సంస్థల ద్వారానే భర్తీ చేశారు. అప్పట్నించీ క్రమేణ 104 సేవలు క్షీణించాయి.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net