Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
వైద్యంలో మూడేళ్ల డిగ్రీ కోర్సు
వచ్చే ఏడాది నుంచి అమలుకు కేంద్రం కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో రెండు కళాశాలలకు అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను అధిగమించడానికి మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సు (బ్యాచులర్‌ ఆఫ్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌)ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొంత కాలం పాటు ఆస్పత్రుల్లో వైద్యులకు సహాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, వైద్య పరిజ్ఞానం అంతగా లేనివారు గ్రామీణ ప్రాంతాల్లో చికిత్సలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడకం పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే యాంటీబయాటిక్స్‌ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రజావసరాల మేరకు నిపుణులు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, అసోం రాష్ట్రాల్లో మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగంగా వైద్యుల కొరతను అధిగమించడానికి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ కోర్సును ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రతి రాష్ట్రంలోనూ కనీసం రెండు కళాశాలలు ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. వైద్య విద్య బోధనలో ఆధునిక విధానాలకు ప్రాధాన్యమిచ్చే పుదుచ్చేరిలోని జిప్‌మెర్‌ (జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి) సహకారంతో ఈ కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలను నాలుగేళ్ల కిందటే రూపొందించారు. ఈ కోర్సు చేసిన వారిని వైద్యచికిత్సలు చేయడానికి అనుమతిస్తే ఎంబీబీఎస్‌కు విలువ ఉండదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో అప్పట్లో అమలుకు నోచుకోలేదు. తాజాగా దేశవ్యాప్తంగా వైద్యుల కొరతను అధిగమించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తక్షణ వైద్యసేవలు అందించడానికి మూడేళ్ల డిగ్రీ కోర్సు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను కూడా రూపొందించారు. దీనికి భారతీయ వైద్యమండలి ఆమోదం లభిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం; తెలంగాణలో నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా ఈ కోర్సుల నిర్వహణకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

ముసాయిదా మార్గదర్శకాలు
* ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ హామీ ఇచ్చిన వారికి ప్రవేశపరీక్ష ద్వారా మూడేళ్ల కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

* ఈ డిగ్రీ పూర్తిచేసిన వారిని ‘వైద్యసహాయకులుగా’ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది.

* వైద్య కళాశాలల్లో ఉద్యోగ విరమణ చేసిన నిపుణులను మూడేళ్ల డిగ్రీ కోర్సు అధ్యాపకులుగా నియమిస్తారు.

* ప్రధానంగా మలేరియా, డెంగీ, విషజ్వరాలు, అతిసారం, క్షయ, రక్తలేమి సమస్యల చికిత్సలపై శిక్షణ ఇస్తారు.

* రోగుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్రమైన నివేదికలు రూపొందించడం నేర్పుతారు.

* వంశపారంపర్యంగా ఉన్న వ్యాధులు, కుటుంబ ఆరోగ్య పరిస్థితి మొదలైన వివరాల సేకరణపై శిక్షణ.

* పాఠ్యాంశాలు: మూడేళ్ల డిగ్రీ కోర్సులో కమ్యూనిటీ మెడిసిన్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, పిడియాట్రిక్స్‌, బేసిక్‌ సర్జరీ, బేసిక్‌ ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, ఆప్తాల్మజీ, ఈఎన్‌టీ, దంతవైద్యం, రేడియో డయాగ్నొస్టిక్స్‌ అంశాలను బోధిస్తారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net