Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
‘రక్తపోటె’త్తుతోంది
51% మంది ఐటీ ఉద్యోగుల్లో హైబీపీ
పెనుముప్పుగా మారుతుందంటున్న నిపుణులు
శారీరక శ్రమకు దూరమైన మహిళలు 27 శాతం
30 ఐటీ కంపెనీల్లోని 6వేల మందిపై ఇ-కిన్‌కేర్‌ సర్వే
అధిక రక్తపోటు (హైబీపీ) ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పాలిట పెనుముప్పుగా పరిణమిస్తోంది. నగరంలోని సగానికిపైగా ఐటీ ఉద్యోగులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ‘ఇ-కిన్‌కేర్‌’ అనే సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, జీవన విధానం సమస్యలే ఇందుకు కారణాలవుతున్నాయని పేర్కొంది. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, విరామం లేకుండా గంటల తరబడి పని, ఆరోగ్యంపై శ్రద్ధ లోపించడం తదితర కారణాలతో ఎక్కువ శాతం ఉద్యోగులు జబ్బులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది.
ఈనాడు - హైదరాబాద్‌
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మరణాల్లో 25 శాతం గుండె సంబంధిత వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయి. హృద్రోగ సమస్యలు అధికంగా సంభవించే వృత్తుల్లో సాఫ్ట్‌వేర్‌ రంగమూ ఒకటి. దీనికి అధిక రక్తపోటూ కారణమేనని వైద్యులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సవాళ్లు, ఒత్తిడి, శారీరకశ్రమ, మద్యపానం, ధూమపానం వంటి పలు అంశాలపై వివరాలను సేకరించి ఇ-కిన్‌కేర్‌ వైద్యులు నివేదిక రూపొందించారు. నగరంలోని 30 ఐటీ కంపెనీల్లో పని చేస్తోన్న 25 నుంచి 55 ఏళ్ల వయసున్న 6వేల మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 4,500 మంది పురుషులు కాగా 1,500 మంది మహిళలు. సర్వేలో పాల్గొన్నవారిలో 3,600 మంది (51 శాతం) అధిక రక్తపోటు కలిగి ఉన్నారని, వారిలో అప్పటికే 720 మంది ఉద్యోగులు ఆ రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ రక్తపోటు 43 శాతం మందిలో, అధిక రక్తపోటుకు గురికాబోతున్నవారు 37 శాతం, తీవ్రమైన రక్తపోటు బాధితులు 12 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వారి నుంచి రక్తపోటు, చక్కెర స్థాయి, బీఎంఎస్‌ లెక్కలతోపాటు ధూమపానం, మద్యపానం, శారీరక వ్యాయామం వంటి జీవనవిధాన వివరాలను సేకరించిన వైద్యులు పలు అంశాలను వెల్లడించారు.

ఆహారపు అలవాట్లే ముంచుతున్నాయి..
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో ఎక్కువ మంది బయటి ఆహారంపై ఆధారపడుతున్నారు. దీంతో వారిలో రక్తపోటు సమస్య పెరిగిపోతోందని అధ్యయనం పేర్కొంది. వీరిలో శారీరక శ్రమకు అవకాశం తక్కువని.. నడక, వ్యాయామం వంటివి కూడా చేయకపోవడంతో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. ‘‘ఫాస్ట్‌ఫుడ్స్‌ తీసుకోవడం, ఎనర్జీ డ్రింక్స్‌, ఇతర ఆహార పదార్థాల కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. చిన్నపాటి శ్రమకే అలసిపోతుంటారు. ఎక్కువ మంది ఇంట్లోనూ కార్యాలయ పనిభారాన్నే తలచుకుంటూ ఒత్తిడిని ఇంకా పెంచుకుంటారు. అది దూరం కానంతవరకు రక్తపోటు తగ్గదు’’ అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటికెళ్లాక ఆఫీస్‌ పనిని పక్కనపెట్టి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలని, రక్తపరీక్షలు తరచూ చేయిస్తూ రక్తపోటు అదుపులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘అధిక రక్తపోటు మనిషిని నిశ్శబ్దంగా నష్టపరుస్తుంది. దేశంలో ఎక్కువమంది రక్తపోటుతో కలిగే హృదయ సంబంధ రుగ్మతలకు గురవుతున్నారు. వృత్తిపరమైన ఒత్తిడితో బాధపడే ప్రతి వ్యక్తీ రక్తపోటుపై అవగాహన పెంచుకొని, జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటున్నారు ఇ-కిన్‌కేర్‌ క్లినికల్‌ సలహాదారు డాక్టర్‌ ఉన్నికృష్ణన్‌.

హెచ్‌ఆర్‌ విధానంలో మార్పు రావాలి

త్తిడి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఇతర రంగాల ఉద్యోగులపై జరిపిన అధ్యయనంలో వారి హెల్త్‌ స్కోర్‌ 72గా నమోదైతే, ఐటీ ఉద్యోగుల్లో 68గా తేలింది. అంటే ఆరోగ్యపరంగా వారు తక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. యుక్తవయసులోని వారూ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆహారం, వ్యాయామంపై 90 శాతం మంది అజాగ్రత్తగా ఉంటున్నారు. దీనికి ఉన్నది ఒకటే పరిష్కారం. ఉద్యోగుల్లో మార్పు రావాలి.. లేదంటే ఒత్తిడిని ఎదుర్కొనేలా సంస్థల మానవ వనరుల విధానంలోనే మార్పు తెచ్చేందుకు యాజమాన్యాలు కృషి చేయాలి.
- కిరణ్‌, ఇ-కిన్‌కేర్‌ సంస్థ వ్యవస్థాపకుడు

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net