Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


దుష్ప్రవర్తనతోనే షట్పుర వధ
దైవాన్ని మోసం చేయాలనుకోవటం అసాధ్యం. సత్పురుషులను, సాధు జనులను ఇబ్బందులపాలు చేస్తే ఏదో ఒక రకంగా నష్టం జరిగే తీరుతుంది అనే విషయాలను వివరించి చెప్పే ఈ సందర్భం హరివంశ పురాణం ఎనభై నాలుగు నుంచి ఎనభైఏడో అధ్యాయం వరకూ ఉన్న కథాసార సంగ్రహం. త్రిపురాసురుడు లోకాలన్నిటినీ బాధిస్తున్నప్పుడు శివుడు సర్వలోక రక్షణార్థం ఆ అసురులను అంతం చేశాడు. త్రిపురాసురులతో చేసిన యుద్ధంలో ఆ అసురులతోపాటు వారి అనుచరులైన మరో ఆరు లక్షల మంది రాక్షసులు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే శివుడు తన లక్ష్యంగా ఎంచుకొన్నది ప్రధానంగా ముగ్గురు రాక్షసులనే. అందుకే ఆయన ఇతర రాక్షసులు ఎంత మంది తననెదిరిస్తున్నా వారిని వదిలిపెట్టి కేవలం లోకాలను బాధిస్తున్న ఆ ముగ్గురిని మాత్రమే వధించాడు. ఆ తర్వాత ముల్లోకాలూ శాంతించాయి. ఎవరి పనులు వారు ఈశ్వరుడి పుణ్యమా అని సక్రమంగా నిర్వర్తించుకోసాగారు. కొద్ది కాలానికి ఓ విచిత్రం జరిగింది. త్రిపురాసురులతోపాటు యుద్ధంలో పాల్గొన్న ఆరు లక్షల మంది రాక్షసులు ఓ చోట సమావేశమై ఎలాగైనా సరే తమ బంధువులను చంపిన శివుడిని అంతం చేయాలనుకొన్నారు. వెంటనే వారంతా కలిసి బ్రహ్మ గురించి కఠోరమైన దీక్షతో తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వెంటనే వారంతా కలిసి తాము శివుడిని అంతం చేసేలా అనుగ్రహించమన్నారు. అప్పుడు బ్రహ్మ శివుడంటే సామాన్యుడు కాడని, సకల లోకాలకు అధినాయకుడని, ఆయనే సృష్టికర్త, లయకారకుడు కూడా అని వివరించి చెప్పాడు. ఎలాగైనా సరే శివుడిని సంహరించటమే తమ లక్ష్యమని, అందుకు తగిన వరాలిమ్మని రాక్షసులు కోరారు. బ్రహ్మ అది కుదరని పని అని స్పష్టం చేశాడు. అయినా అదే వరం కావాలన్నారు ఆ ఆరులక్షల మంది రాక్షసులు. అందుకు అనువుగా తమకు భూమికి అడుగున షట్పురాలను (ఆరు పురాలను) నిర్మించి ఇవ్వాలని, అక్కడకు శివుడు రాకుండా చూడాలని కోరారు అసురులు. బ్రహ్మ అప్పుడు వారికి ఆ షట్పురాలను తాను నిర్మించి ఇస్తానని, అయితే అక్కడ నివసించే రాక్షసులంతా సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నాడు. రుషులు, మునులు లాంటి సత్పురుషులను ఎవరినీ బాధించకూడదని, అప్పుడే వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పి అంతర్థానం అయ్యాడు. ఆ తర్వాత వారు కోరుకున్నట్టే భూమి అడుగున షట్పురాల నిర్మాణం జరిగింది. అక్కడికి ఆ రాక్షసులంతా వెళ్ళి స్థిరపడ్డారు. ఆ షట్పురాల నిర్మాణానికి ముందే ఆ ప్రాంతంలో బ్రహ్మదత్తుడనే రుషి అశ్వమేథ యాగాన్ని చేస్తున్నాడు. ఆ రుషికి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు లాంటి వారంతా మిత్రులు. వారందరినీ యాగానికి ఆహ్వానించాడు. ఆ బ్రహ్మదత్తుడికి అధిక సంఖ్యలో కుమార్తెలు ఉన్నారు. యాగం సక్రమంగా జరుగుతోంది. ఇలా కొద్దికాలం గడిచాక షట్పురాలలో నివాసం ఉంటున్న రాక్షస నాయకుడైన నికుంభుడు అనే రాక్షసుడు అశ్వమేథ యాగాన్ని చూశాడు. వెంటనే తన వారందరితో కలిసి వెళ్ళి యాగంలో హవిస్సులన్నీ తమ రాక్షసులకే సమర్పించాలని, దేవతలకు ఇవ్వటానికి వీలు లేదని అన్నాడు. బ్రహ్మదత్తుడు వారికి నచ్చచెప్పబోయాడు. రాక్షసులు ఆ రుషి మాటలను వినకపోగా ఆ పక్కనే తిరుగాడుతున్న సుందరాంగులైన రుషి కుమార్తెల మీద వారి కన్ను పడింది. యాగానికి సంబంధించిన హవిస్సులతోపాటు ఆ కుమార్తెలను కూడా తనకే ఇవ్వాలని అన్నాడు నికుంభుడు. అది అధర్మమని, ఆ కుమార్తెలందరికీ తగిన వీరులతో అంతకుముందే వివాహం నిశ్చయమైందని బ్రహ్మదత్తుడు ఎంత చెప్పినా రాక్షసులు వినలేదు. ఈ పరిస్థితినంతా చూస్తున్న వసుదేవుడు తన కుమారులైన బలరామ శ్రీకృష్ణులను స్మరించాడు. అయితే వారొచ్చేలోపునే ఓ వందమంది కన్యలను రాక్షసులు బలవంతంగా తమ వెంట తీసుకు వెళ్ళారు. బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు అక్కడికి చేరారు. కృష్ణుడి ఆజ్ఞ మేరకు ప్రద్యుమ్నుడు ఓ వందమంది మాయా కన్యలను సృష్టించి రాక్షసుల దగ్గర వదిలి అసలు కన్యలను తెచ్చి బ్రహ్మదత్తుడికి అప్పగించాడు. యజ్ఞం పూర్తైంది. ఆ తర్వాత శ్రీకృష్ణాదులు నికుంభుడు తదితర షట్పుర రాక్షసులను వధించారు. ఇలా రాక్షసుల వధవల్ల మళ్ళీ లోక శాంతి, ధర్మం వర్ధిల్లాయి. ఈ కథలో ఓ సామాజిక సందేశం కనిపిస్తుంది. దుర్మార్గపు బుద్ధి అసలు ఉండనేకూడదు. ఉంటే దైవాన్ని సైతం మోసం చేయాలనే అనిపిస్తుంది. ఎదురుగా ఎన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా చెడు మార్గవర్తనులు తమ మనస్సును మార్చుకోరు. నికుంభుడు లాంటి రాక్షసులంతా త్రిపురాసుల వధ చూశారు. శివుడు వారిని ఎందుకు వధించాడో తెలుసుకోకపోగా ఇంకా మూర్ఖంగా ఆ శివుడినే అంతం చేయాలని అనుకొని ఎన్ని ఎత్తులు వేసినా చిట్టచివరకు వారి దుష్ప్రవర్తనే వారి అంతానికి కారణమైంది. ఈ విషయాన్ని గమనించి జీవితాన్ని దైవం సూచించిన సక్రమ మార్గంలో నడుపుకోవాలన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net