Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: స్త్రీ

సినిమా పేరు: స్త్రీ(హిందీ)

నటీనటులు: రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌, అపరశక్తి ఖురానా, పంకజ్‌ త్రిపాఠి తదితరులు

కథ: సుమిత్‌ అరోరా

సంగీతం: సచిన్‌, జిగర్‌

కూర్పు: హేమంతి సర్కార్‌

సినిమాటోగ్రఫీ: అమలేందు చౌదరి

నిర్మాణ సంస్థలు: మ్యాడాక్‌ ఫిలింస్‌, డీ2ఆర్‌ ఫిలింస్‌

నిర్మాతలు: దినేజ్‌ విజన్‌, రాజ్‌, డీకే

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమర్‌ కౌశిక్‌

విడుదల తేదీ: 31-08-2018

రుస విజయాలతో బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్ దూసుకుపోతున్నారు. ‘ఆషికి 2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా..అతితక్కువ సమయంలో అగ్రకథానాయికల జాబితాలో ఒకరిగా నిలిచారు. మరోపక్క విలక్షణ నటుడిగా హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ మెప్పిస్తున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ’. తెలుగువారైన దర్శకద్వయం రాజ్ - డి.కె.. స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు నిర్మాతలుగానూ వ్యవహరించారు. 90వ దశకంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ ఆడ దెయ్యం సంచరిస్తోందన్న పుకార్లకు భయపడి ‘ఓ స్త్రీ రేపురా’ అని ఇళ్ల గోడలపై రాసుకున్న ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఆ ‘స్త్రీ’ ఎవరో? ఆమె కథేంటో? తెలుసుకుందాం పదండి.

కథేంటంటే: విక్కీ(రాజ్‌కుమార్‌) చందేరీలో దర్జీ. అతనికి ఊరి జాతరలో స్త్రీ(శ్రద్ధా)తో పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తనది ఆ ఊరు కాదని, ఏటా జాతరకు మాత్రమే వచ్చి వెళ్తుంటానని విక్కీతో చెబుతుంది స్త్రీ. జాతర సమయంలోనే స్త్రీ అక్కడికి ఎందుకు వస్తోంది? ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? కొన్నేళ్ల క్రితం ఆ ఊరిలో అనూహ్యంగా అదృశ్యమైన నర్తకికి, స్త్రీకి ఏమైనా సంబంధముందా? స్త్రీ దెయ్యమా? కాదా? అనే విషయాలు తెరమీద చూడాల్సిందే.

ఎలా ఉందంటే: హారర్‌ సినిమాలు ఇండస్త్రీకి కొత్తేం కాదు. ఏడాదిలో తెరకెక్కే చిత్రాల్లో రెండు, మూడు సినిమాలు ఆ జోనర్‌కు చెందినవే ఉంటాయి. అయితే హారర్‌ సినిమాలను తెరకెక్కించడం అంత సులువు కాదు. కథకు తగ్గ భయంకరమైన సన్నివేశాలు, కామెడీ ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాలకు కనెక్ట్‌ అవుతారు. అయితే ‘స్త్రీ’ చిత్రంలో హారర్‌కు తక్కువగా, కామెడీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు దర్శకుడు. అతనికి ఇది తొలి సినిమా. అయినప్పటికీ సుమిత్‌ అరోరా రాసుకున్న కథకు తగ్గట్టుగా అమర్‌ కౌశిక్‌ సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటాయి. కానీ సినిమా జోనర్‌కు తగ్గట్టు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే సన్నివేశాలు తగ్గినట్లు అనిపిస్తాయి. భయపెట్టే సన్నివేశాలకు కామెడీ జోడించడంతో అవి తేలిపోతాయి. సచిన్‌, జిగర్‌ అందించిన పాటలు వినసొంపుగా ఉంటాయి. అసలు దెయ్యం ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి విక్కీ చేసే ప్రయత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి. రాజ్‌, డీకే అందించిన స్క్రీన్‌ప్లే బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే: ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్ల పాత్రలే కీలకం. ఎప్పటిలాగే రాజ్‌కుమార్‌ రావ్‌ తన హావభావాలు, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. శ్రద్ధా కపూర్‌ తన అందంతో, నటనతో మెప్పించారు. అమాయకంగా కన్పిస్తూనే, రాజ్‌కుమార్‌ రావ్‌ని, అతని స్నేహితులను హడలగొట్టే సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పడానికి లేదు. ఎవరికి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. కృతి సనన్‌ ఒక పాటలో తళుక్కున మెరుస్తారు. ఆ పాటను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.

బలాలు:

+ కథ, కథనం

+ రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధ నటన

+ సంభాషణలు

+ పాటలు

బలహీనతలు:

- అవసరమైన చోట హారర్‌ సన్నివేశాలు లోపించడం

చివరగా: ఈ ‘స్త్రీ’ ఎక్కువగా భయపెట్టదు..!

గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.