kalanjali_200
Comments
0
Recommend
0
Views
675
కార్యాచరణే అతి పెద్ద సవాలు
ప్రతిష్ఠాత్మక పథకాలపై చందా కొచ్చర్‌
మరింత నిబద్ధతతో కృషి చేయాలి
‘ఇండియా కాన్ఫరెన్స్‌-2016’లో ప్రసంగం
వాషింగ్టన్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ తయారీ’, ‘డిజిటల్‌ ఇండియా’ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయడం, సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడమే దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లని ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) చందా కొచ్చర్‌ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిబద్ధతతో కృషిచేస్తోందని, పారదర్శకత కోసం ఇగవర్నెన్స్‌పై దృష్టి సారించిందని తెలిపారు. భారత్‌కు 9-10 శాతం వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నా, నిర్దేశించుకున్న ప్రణాళికలను సరిగ్గా ఆచరించక పోవడం వల్లే సాధ్యం కావడం లేదన్నారు. హార్వార్డ్‌ కెన్నడీ స్కూల్‌, హార్వార్డ్‌ యూనివర్సిటీ ఉమ్మడిగా ఇక్కడ నిర్వహించిన ‘ఇండియా కాన్ఫరెన్స్‌-2016’లో ఆమె ప్రసంగించారు. ‘ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా అభివృద్ధి, వేగవంతమైన వృద్ధి కోసం మన పార్లమెంట్‌ వ్యవస్థ మరింత వేగంగా పని చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దివాలా బిల్లు, వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఇంత వరకు చట్ట రూపం దాల్చలేదు.మౌలిక, తయారీ రంగ ప్రాజెక్టులకు..భూసేకరణ, సహజ వనరుల వినియోగం వంటి విషయాల్లో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టకపోతే వృద్ధికి మనమే ఆటంకాలు సృష్టించినట్లు అవుతుంది’ అని చందాకొచ్చర్‌ పేర్కొన్నారు. యువశక్తికి నాణ్యమైన విద్యను అందించి, సరైన నైపుణ్యంతో అత్యధికులకు ఉపాధి లభించేలా చర్యలు చేపడితే, దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
Your Rating:
-
Overall Rating:
3.0

ధనా‘గన్‌’

ముంబయి తరహా కాల్పుల ఘటనలు హైదరాబాద్‌లోనూ జరుగుతున్నాయని సోమవారం చోటుచేసుకున్న ఉదంతం రుజువుచేస్తోంది. కార్పొరేటు ఆసుపత్రి ప్రారంభం, వాటాల పరంగా పొరపచ్చాలు...

మోకీలుకు ముడి పడింది

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మో‘కీలు’ మార్పిడి శస్త్ర చికిత్సల నిర్వహణకు ‘నిధుల సమస్య’ వచ్చి పడింది. మరోవైపు ఈ శస్త్ర చికిత్సల కోసం అవసరమైన నిరుపేదలు నిత్యం ఆసుపత్రిని సంప్రదిస్తున్నారు.

‘మార్పు’ ఇదేనా ..‘మన భవిత’ భద్రమేనా?

ఈ చిత్రంలోని పెద్దపాళెం పంచాయతీ వీరాంజనేయపురానికి చెందిన పదిరోజుల బాలింత శారద(19) ఆదివారం రాత్రి మృతిచెందారు.

పశ్చిమాన పుష్కలం తూర్పున నిష్ఫలం

కొత్తగా వేలం వేయనున్న రేవులు: ప్రస్తుతం చెవిటికల్లు, కంచెల, శనగపాడు, పొక్కునూరు, కాసరబాద, అల్లూరుపాడు, సూరాయిపాలెం, గుంటుపల్లి, భవానీపురం, పెదపులిపాక, మద్దూరు.