AP News : జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన

తాజా వార్తలు

Updated : 21/06/2021 12:09 IST

AP News : జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన

అమరావతి : ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.

విజయనగరంలో యువత ఆందోళన బాట పట్టింది. విద్యార్థి సంఘాలు ఈ ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం కల్పించారని విద్యార్థులు విమర్శించారు. ఇది నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖాల్లోని ఖాళీలతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

విశాఖపట్నం జీవీఎంసీ వద్ద నిరుద్యోగ యువకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే మెగా డీఎస్సీ పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్యోగ క్యాలెండర్‌ సరిగా లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని