తాడేపల్లిలో 144 సెక్షన్‌ అమలు: ఎస్పీ హఫీజ్‌

తాజా వార్తలు

Updated : 17/07/2021 18:20 IST

తాడేపల్లిలో 144 సెక్షన్‌ అమలు: ఎస్పీ హఫీజ్‌

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లుండి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏపీ నిరుద్యోగ, విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. అయితే.. నిరుద్యోగ సంఘాలు తలపెట్టిన చలో తాడేపల్లికి అనుమతి నిరాకరించినట్టు గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున  అనుమతి లేదని స్పష్టం చేశారు.

‘‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, రాజ్యాంగబద్ధ  పదవిలో ఉన్నవారి విధులకు ఆటంకం కలిగించడం నేరం. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, సీఎంవో ముట్టడించడం నేరం. నిరుద్యోగుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉంది. అనుమతి లేకుండా ఆందోళన చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి’’ అని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని