close
ఇసుక సమస్యపై పోరాటం ఆగదు: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: ఇసుక సమస్యను పరిష్కరించేంత వరకూ తెలుగుదేశం చేస్తున్న పోరాటం ఆగదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. పనుల్లేక ఆత్మహత్యలకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న కార్మికుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని, ఉచిత ఇసుక విధానం అమలు చేయాలన్న... మూడు డిమాండ్లతో తెదేపా ముందుకెళుతుందని వివరించారు. పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.800 కోట్లు ఆదా చేస్తామని చెబుతూ.. ఒక జీవోలో రూ.500 కోట్లు, మరో జీవోలో రూ.500 కోట్లు కేటాయిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం మీడియా నుంచి ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతోందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇంటి వద్ద గత ఐదు నెలలుగా 144 సెక్షన్‌ అమలు చేయడం విడ్డూరమన్నారు. తెదేపా ప్రభుత్వంలో పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై నాడు వైకాపా ఎగతాళి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారో... లేదో చూసుకోకుండా, ఇతరత్రా ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వంద శాతం ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఇంకా అవగాహన పెరగాలని, దోమలపై దండయాత్ర అని పేర్కొంటున్నారని, డెంగీ...మలేరియాతో 2,500మంది చనిపోతే పట్టించుకోవడం లేదని లోకేశ్‌ విమర్శించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.