close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజ్యసభ ఎన్నికలు 19న

ఏడు రాష్ట్రాల్లోని 18 స్థానాలకు పోలింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో 4 సీట్లకు కూడా..

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు నిలిచిపోయిన ఎన్నికలను ఈనెల 19న నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొత్తగా ఖాళీ అవుతున్న మరో మూడు రాష్ట్రాల్లోని 6 స్థానాలకు కూడా ఎన్నికల్ని ప్రకటించింది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలోని 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో పది రాష్ట్రాల్లోని 37 స్థానాలకు అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిగిలిన రాష్ట్రాల్లోని స్థానాలకు మార్చి 26న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న ప్రకటించింది. అలా నిలిచిపోయిన 18 స్థానాలకు ఈ నెల 19న ఎన్నిక నిర్వహించాలని తాజాగా నిర్ణయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, ఝార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 3, మణిపుర్‌లో 1, మేఘాలయలో 1, రాజస్థాన్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

కొత్తగా కర్ణాటక సహా మూడు రాష్ట్రాల్లో..
కొత్తగా కర్ణాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాంల్లోని ఆరు స్థానాలకు 19 తేదీనే ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలోని నాలుగు, అరుణాచల్‌, మిజోరాంలలో చెరొక స్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు. ఈ సభ్యుల పదవీ కాలం జూన్‌, జులై నెలల్లో ముగుస్తుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.