close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజధానిపై భాజపా ద్వంద్వ వైఖరి

కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి
అమరావతి రైతుల డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తుళ్లూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: రాజధాని అంశంపై భాజపా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అమరావతి రైతులు, రైతు కూలీలు ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఒకలా.. రాష్ట్ర భాజపా నేతలు మరోలా స్పందిస్తున్నారని, ఈ విధానం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తాము చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి రైతుల వేదనను పట్టించుకోవాలని కోరారు. అమరావతికి మద్దతుగా ప్రజలు అన్ని ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు 239వ రోజు ఆందోళనలు కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్లు, చెవులు, నోరు మూసుకుని నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. అబ్బురాజుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం, వెలగపూడి, మందడం, రాయపూడి, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, బోరుపాలెం, మల్కాపురం, అనంతవరం తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాలు, వీధులు, ఇళ్ల ముందు రైతులు ఆందోళనలు నిర్వహించారు. ‘అమరావతి వెలుగు’లో భాగంగా విద్యుద్దీపాలను నిలిపేసి ఇళ్ల ముందు కొవ్వొత్తులతో దీక్ష చేపట్టారు. సేవ్‌ అమరావతి పేరుతో ముగ్గులు వేశారు.
ఐకాసకు రూ.3 లక్షల విరాళం
అమరావతి రైతుల నిరసనలకు సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం తుళ్లూరు దీక్షా శిబిరాన్ని సందర్శించి అమరావతి ఐకాసకు రూ.3 లక్షల విరాళం ప్రకటించారు. విజయవాడ ఇన్నర్‌ వీల్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు ఉషారాణి రైతులకు సంఘీభావం తెలిపారు.
రాజధాని లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి?: ఎమ్మెల్యే అనగాని
‘ఏ రాష్ట్రానికైనా రాజధాని అనుకూలంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. నేడు జగన్‌ వైఖరితో రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాదిన్నరగా కనీసం ఒక పరిశ్రమైనా వచ్చిందా? వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు.. ఉద్యోగులకు జీతాల్లేవు’.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.